మూసాపేట్ మెట్రో స్టేషన్‌లో బుల్లెట్ కలకలం
posted on Oct 19, 2025 12:01PM

హైదరాబాద్ మూసాపేట్ మెట్రో స్టేషన్‌లో బుల్లెట్ కలకలం రేపింది. మెట్రోలో ప్రయాణించేందుకు వచ్చిన ఓ బాలుడు వద్ద బుల్లెట్ కనిపించండంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న కూకట్‌పల్లి పోలీసులు బుల్లెట్‌ను స్వాధీనం చేసుకొని, బాలుడిని విచారిస్తున్నారు.
బీహార్ రాష్ట్రానికి చెందిన మహమ్మద్ అనే యువకుడు మూసాపేట ప్రగతినగర్‌లో ఉంటూ ఫ్యాబ్రికేషన్ వర్క్ చేస్తున్నాడు. శనివారం రాత్రి ఓ బ్యాగ్‌తో మెట్రోలో ప్రయాణానికి వచ్చాడు. సాధారణ స్కానింగ్ సమయంలో భద్రతా పరికరం బీప్ ఇవ్వడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే అతడి సామాను క్షుణ్ణంగా పరిశీలించగా 9 ఎంఎం బుల్లెట్ బయటపడింది. వెంటనే ఈ విషయాన్ని కూకట్‌పల్లి పోలీసులకు సమాచారం అందించారు. బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.