మోడీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఇదే!
posted on Oct 14, 2025 9:11AM
.webp)
ప్రధాని నరేంద్రమోడీ ఈ నెల 16న ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సాగనున్న ఆయన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది. ప్రధాని నరేంద్రమోడీ ఈ నెల 16 ఉదయం 7.50 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 10.20 గంటలకు కర్నూలు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 10.25 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో సున్నిపెంట కు చేరుకుంటారు.
అక్కడ నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైలం భమరాంబ గెస్ట్ హౌస్ కు చేరుకుంటారు. కొద్ది సేపు విశ్రాంతి తరువాత 11.45 గంటలకు భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. అనంతరం 12.45 గంటలకు భ్రమరాంబ గెస్ట్ హౌస్‌కు తిరిగి చేరుకుని, 1.25 గంటలకు సున్నిపెంట హెలిప్యాడ్‌కి బయల్దేరతారు. మధ్యాహ్నం 2.30 గంటలకు రాగమయూరి గ్రీన్ హిల్స్ వెంచర్‌లో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తరువాత రోడ్డు మార్గంలో నున్నూరు హెలిప్యాడ్ కు చేరుకుని అక్డ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో కర్నూలు ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెడతారు.