బాలయ్య మళ్లీ కొట్టాడు..

బాలయ్య బాబుకు మళ్లీ కోపం వచ్చింది. మరోసారి ఆయన చెయ్యి లేచింది. టపీ టపీ మంటూ రెండు దెబ్బలేశాడు బాలకృష్ణ. ఆయన చేతిలో దెబ్బలు తిన్నది ఓ ఫోటోగ్రాఫర్. మున్నిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హిందూపురంలో పర్యటిస్తున్నారు బాలయ్య. 9వ వార్డులో ఓ ఇంట్లోకి వెళ్లిన బాలయ్య ప్రచారం చేస్తుండగా అక్కడే ఉన్న ఫోటోగ్రాఫర్ ఫోటోలు క్లిక్ అనిపించాడు. 

పర్మిషన్ లేకుండా తన ఫోటోలు తీయడంతో తీవ్ర ఆవేశానికి లోనయ్యారు బాలయ్య. వెంటనే అతనిపై చేయి చేసుకున్నారు. అనుమతి లేకుండా ఫోటో తీస్తావా అంటూ చెయ్యితో రెండు దెబ్బలేశారు. ఆవేశంతో ఊగిపోతూ.. ఫోటోగ్రాఫర్ మీద మీదకు వెళ్లి.. కొట్టారు. పక్కనే ఉన్న కార్యకర్తలు ఆపుతున్నా బాలయ్య ఆగలేదు. మొదట ఓ దెబ్బేశారు. అయినా, ఆయనలో ఆగ్రహం చల్లారలేదు. మళ్లీ మీదకు వెళ్లి మరోసారి చెయ్యికి పని చెప్పారు. పర్సనల్‌గా మాట్లాడుతుంటే ఫోటో తీస్తావా? వెంటనే డిలీట్‌ చేయ్‌ అంటూ మండిపడ్డారు బాలకృష్ణ. బాలయ్య కోపాన్ని చూసిన అక్కడి వారంతా హడలెత్తిపోయారు.