మంత్రి రోజాకు ఏమైంది?
posted on Jun 12, 2023 10:07AM
మంత్రి ఆర్కే రోజాకు ఏమైందన్నఆందోళన రాజకీయవర్గాల్లోనే కాకుండా సామాన్య జనంలో కూడా వ్యక్తం అవుతోంది. కారణం ఏమిటన్నది తెలియదు కానీ ఆమె ప్రస్తుతం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఆమె ఆరోగ్య పరిస్థితి ఏమిటి? ఆమె ఎందుకు ఆస్పత్రిలో చేరారు అన్న విషయం తెలియరాలేదు. ఆస్పత్రి వర్గాలు కూడా ఆమె ఆరోగ్యం గురించి ఎటువంటి హెల్త్ బులిటెన్ విడుదల చేయలేదు. అయితే పార్టీ వర్గాలు, విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆమె ఆరోగ్యం బాలేదనీ, ఇప్పటికే గతంలో ఆమెకు రెండు సార్లు శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలిసిందే. ఆ రెండు సార్లూ కూడా ఆమె చెన్నై అపోలో ఆస్పత్రిలోనే చికిత్స తీసుకున్నారు.
గతంలో ఆపరేషన్ తరువాత ఆమె ఎక్కువ రోజులు విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే. గతంలో ఆమెకు ఆపరేషన్ జరిగిన సమయంలో ఆమె మంత్రి కారు. ఎమ్మెల్యే మాత్రమే. అప్పట్లో జబర్ద్ షోకు జడ్జిగా వ్యవహరించేవారు. ఆపరేషన్ కారణంగా అప్పట్లో ఆమె జబర్దస్త్ షోకు చాలా కాలం దూరంగా ఉన్నారు. ప్రస్తుతం రోజాకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఆస్పత్రి వర్గాలు ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందనీ, త్వరలో డిశ్చార్జ్ చేస్తామని అంటున్నాయి.