తెలంగాణ అప్పుల లెక్కలు తప్పైతే రాజీనామా చేస్తా.. మంత్రి జూపల్లి..!

posted on: Jul 3, 2026 4:24PM

 

తెలంగాణ అప్పులపై చర్చకు సిద్దమని మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్‌ఎస్ నేతలకు సవాల్ విసిరారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో బహిరంగ చర్చకు రావాలని ఆహ్వానించారు. "మీరు చెప్పిన అప్పుల లెక్కలే తప్పని తేలితే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా? లేక ప్రజలకు క్షమాపణ చెబుతారా?" అని మంత్రి ప్రశ్నించారు. వాట్సాప్ ద్వారా కూడా అప్పుల వివరాలను వారికి పంపించినట్లు తెలిపారు. "నేను ఎప్పుడూ తోక ముడవలేదు. వెనక్కి తగ్గే స్వభావం నాది కాదు.

 ఇష్టారీతిన మాట్లాడితే చూస్తూ ఊరుకోను. ప్రజల ముందు నిజాలు బయటపెట్టడానికి ఎలాంటి చర్చకైనా సిద్ధమే" అని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. నేను చెప్పిన అప్పుల లెక్కలు తప్పని రుజువు చేయండి. నా వాదన తప్పని నిరూపిస్తే ఇప్పటికీ రాజీనామాకు సిద్ధంగా ఉన్నాను" అని జూపల్లి ప్రకటించారు. దీనిపై మాటల యుద్ధం కాకుండా రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలను కోరారు. మంత్రి విసిరిన ఈ సవాల్‌కు బీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...