Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి..?
posted on: Aug 5, 2026 8:57PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక బ్రాండ్ అంబా సిడర్‌గా మెగాస్టార్ చిరంజీవిని నియమించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రతిష్ఠను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత పెంచడంతో పాటు పర్యాటకం, పెట్టుబ డులను ఆకర్షించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. గతంలో గుజరాత్ పర్యా టక రంగానికి బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించి ఆ రాష్ట్ర ప్రచారానికి విశేషంగా తోడ్పడిన నేపథ్యంలో, అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ బిల్డింగ్ కోసం చిరంజీవిని ఎంపిక చేయాలని ప్రభుత్వం భావిస్తున్న ట్లు సమాచారం.
ఈ ప్రతిపాదనపై ప్రభుత్వ వర్గాలు, సంబంధిత ప్రతినిధుల మధ్య ఇప్పటికే ప్రాథమిక స్థాయి సంప్రదింపులు పూర్తైనట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించడం, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం, దేశ విదేశాల్లో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ విలువను పెంచడం వంటి అంశాల్లో చిరంజీవి సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ విషయంపై ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలు వడలేదు. అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే ఈ నియామకంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Megastar as AP brand ambassador, Chiranjeevi, CM Chandrababu, Pavan kalyan, Naralokesh, AP Goverment


.webp)



