Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...గృహప్రవేశంలో రక్తపాతం...50 మంది దుండగులు బీభత్సం
posted on: Jun 28, 2026 10:48AM

మేడ్చల్ జిల్లా బోడుప్పల్ పరిధిలోని దేవేందర్ నగర్‌లో ఆనందంగా సాగాల్సిన గృహప్రవేశ వేడుక ఒక్కసారిగా భయానకంగా మారింది. కొత్త ఇంట్లో కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి పూజలు నిర్వహిస్తున్న సమయంలో సుమారు 50 మంది దుండగులు కర్రలు, రాళ్లతో ఒక్కసారిగా ఇంటిపై దాడికి పాల్పడుతూ రచ్చ రచ్చ సృష్టించారు.
దుండగులు ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడి ఎదురైన వారిపై విచక్షణారహితంగా దాడి చేసినట్లు బాధితులు చెబుతున్నారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు అని కూడా చూడకుండా దాడి చేయడంతో ఇంట్లో తీవ్ర భయాందోళన నెలకొంది. గృహప్రవేశానికి వచ్చిన బంధువుల్లో పలువురికి గాయాలయ్యాయి. కొందరికి తలకు, చేతులకు గాయా లైనట్లు బంధువులు చెప్తున్నారు.
ఈ ఘటనతో దేవేందర్ నగర్ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘ టనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. దాడికి దారితీసిన కారణాలపై ఆరా తీస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దాడికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ దాడికి అసలు కారణం ఏమిటి? దుండగులు ఎవరు? అనే అంశాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.






