మేడ్చల్ జిల్లాలో కాల్పుల కలకలం

 

మేడ్చల్ జిల్లా పోచారంలో కాల్పుల కలకలం రేగింది. సోనుసింగ్ అనే వ్యక్తిపై దుండగుడు కాల్పులు జరిపి పరారయ్యాడు. గాయపడిన సోనుసింగ్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పోచారం ఐటీ కారిడార్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కాల్సుల జరిపిన వ్యక్తి ఇబ్రహీంగా గుర్తించారు. కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలిస్తున్నారు. కాల్పులకు గల కారణాలు తెలియరాలేదు. హైదరాబాద్​ నగరంలో ఇటీవల నేరాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

 ఓ వైపు డ్రగ్స్​ దందా సాగుతుండగా.. హత్యలు క్రైమ్ రేటు సైతం పెరిగిపోయింది. గతంలో దోపిడీ దొంగలు గన్​లతో బెదిరించి చందానగర్​లో ఓ గోల్డ్ షాపులో చోరీ చేశారు. ఇటీవల మెట్రో స్టేషన్​లో ఓ వ్యక్తి వద్ద బుల్లెట్​ దొరకడం కలకలం రేపింది. తాజాగా పోచారంలో కాల్పులు చోటు చేసుకోవడంతో శాంతిభద్రతలపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా గన్​ కల్చర్​ పెరుగుతుండటంపై సామాన్య ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu