సింగిల్ షూ ఖరీదు.. కేవలం 19.41 కోట్లు
posted on Dec 9, 2014 4:14PM

మరోసారి ఫుట్‌బాల్ ప్రపంచ కప్ గెలవటానికి జర్మనీ 24 సంవత్సరాలు ఎదురుచూడాల్సి వచ్చింది. ఆ నిరీక్షణ ఫలించి గత ఏడాది జర్మనీ అర్జెంటీనాని ఓడించి ప్రపంచ కప్ సొంతం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో ఎక్స్‌ట్రా టైమ్‌లో ఒకే ఒక్క గోల్ కొట్టడం ద్వారా ఫుట్‌బాల్ ప్రపంచ కప్ జర్మనీ వశం అయింది. జర్మనీ ఆటగాడు మరియో గోట్జే ఆ గోల్ సాధించాడు. గోట్జే తన ఎడమ కాలితో గోల్ కొట్టాడు. అప్పటి నుంచి ఆ కాలి షూ మీద జర్మన్లకు అభిమానం పెరిగిపోయింది. ‘ఏ హార్ట్ ఫర్ చిల్డ్రన్’ సమాజ సేవా సంస్థకు నిదుల కోసం ఓ జర్మనీ ఛారిటీ సంస్థ ఆ షూని వేలం వేయగా ఆ షూ విలువ ఇండియా కరెన్సీలో 19.41 కోట్లు పలికింది. ఫుట్‌బాల్ ఫైనల్ మ్యాచ్ పూర్తయిన తర్వాత గోట్జె ఆ షూని ఎప్పుడూ ధరించలేదు. స్టేడియం నుంచి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ షూకి కాస్తంత గడ్డి అతుక్కుని ఎలా వుందో ఇప్పటికీ అలాగే వుంది. తన షూకి ఇంత ధర పలకడం, అది కూడా సమాజ సేవకు ఉపయోగపడటం తనకు ఆనందాన్ని కలిగిస్తోందని గోట్జే అంటున్నాడు.