రేపు అగ్రనేత ఆశన్న టీం లొంగుబాటు
posted on Oct 15, 2025 6:31PM

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు @రూ పేశ్ @తక్కళ్లపల్లి వాసుదేవరావు నేతృత్వంలో వివిధ స్థాయిలకు చెందిన దాదాపు 70మంది పార్టీ కేడర్లు రేపు ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ లేదా డిప్యూటీ సీఎం విజయ్ శర్మ సమక్షంలో లొంగిపోనున్నట్లు జగ్గల్పూర్ నుంచి విశ్వసనీయ సమాచారం అందింది. తమ ఆయుధాలను సైతం అప్పగించేం దుకు సిద్ధమయ్యారు. ఈ బృందం లో డీకేఎస్డ్సీ సభ్యులు రాజమన్, రనితలతో సహా ఉత్తర బస్తర్, మాడ్ డివిజన్లకు చెందిన పలువురు డివిజన్ కమిటీ సభ్యులు, కంపెనీ, ప్లాటూన్ కమాండర్లు, పార్టీ పార్టీ కమిటీల సభ్యులు ఉన్నారని తెలుస్తోంది.
వీరంతా ఇప్పటికే జగ్దల్ పూర్ చేరుకున్నా రని, రేపు నిర్వ హించే లొంగుబాటు సభకు సంబంధించిన ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. ఈరోజు ఉదయం గడ్చిరోలి లో జరిగిన ఒక సభలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సమక్షంలో పాలిట్బ్యూరో సభ్యుడు అభయ్ @సోనూ @భూపతి @మల్లోజుల వేణుగోపాల్ నాయకత్వంలో 60 మంది మావోయి స్టులు తమ ఆయు ధాలతో సహా లొంగిపోయిన విషయం తెలిసిందే. ఇక రేపు ఆశలతో పాటు మరి కొంతమంది మావోయిస్టులు లొంగిపోనున్నారు వరుసగా మావో యిస్టులు లొంగిపోతూ ఉండడంతో ఆ పార్టీలో తీవ్ర కలకలం రేగింది... ఇది ఏమైనాప్పటికీ మావోయిస్టులు అందులో అగ్ర నేతలు.... ముఖ్యమంత్రి ఎదుట లొంగిపోతూ జనజీవనంలో కలిసిపోయేందుకు ముందుకు వస్తున్నారు.