ఫామ్ హౌస్ లో దొరికిన హీరోయిన్
posted on May 29, 2013 6:20PM

తమిళ నటి అయిన లీనా మరియాపాల్ కూడా బ్యాంక్ కి 19 కోట్లు ఎగనామం పెట్టింది. ఈమెకి తమిళంలో మంచి అందగత్తె అనే పేరుంది. కానీ ఈ వ్యవహారం బయటికి రావడంతో తమిళ ప్రేక్షకులతో సహా ఆమె అభిమానులు కూడా ఈమెను ఛీ కొట్టడమే కాకుండా మోసగత్తె అనే బిదురుకూడా ఇచ్చారు. ఈమె ఓ బ్యాంక్ నుండి రుణం పొంది దానిని కట్టకుండా గత కొన్ని రోజుల నుండి తప్పించుకు తిరుగుతుంది. ఈ కేసుకు సంబంధించి చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. తన బాయ్ ఫ్రెండ్ అయిన బాలాజీ ఆలియాస్ చంద్రశేఖర్ తో కలిసి ఢిల్లీలోని ఓ ఫామ్ హౌజ్ లో ఉన్నారని సమాచారం అందుకున్న పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఈమెతో పాటు మరో ఆరుగుర్ని పోలీసులు అదుపులోకి తీసుకొని లీనా , ఆమె బాయ్ ఫ్రెండ్ పై 420 ఛీటింగ్ కేసుతో సహా 406 సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు.