మాదన్నపేట బాలిక హత్య కేసును ఛేదించిన పోలీసులు
posted on Oct 3, 2025 9:26PM

నేటి సమాజంలో రోజురోజుకీ మాన వత్వం ,మంచితనం నశించిపోతున్నాయి... డబ్బుకున్న విలువ బంధాలకు, అనుబంధాలకు లేకుండా పోయింది. ఆస్తికోసం కన్న తల్లిదండ్రులు, తోడబుట్టిన వారిని సైతం చంపేందుకు సిద్ధపడుతున్నారు. మాదన్నపేటలో బాలిక హత్య కేసు వెనుక కూడా ఆస్తి తగాదాలే కారణ మని పోలీసులు తేల్చారు.
కంచన్బాగ్ లో నివాసం ఉంటు న్న మహమ్మద్ అజీమ్, షబానా బేగం కూతురు హుమేయని సుమ్మయ్య (07).... ఈ బాలిక తన తల్లితో కలిసి మాదన్నపేట చావనిలో ఉన్న తన అమ్మమ్మ ఇంటికి వచ్చింది... అయితే గత రెండు రోజుల నుండి పాప కనిపిం చకపోవడంతో కంగారు పడిన తల్లి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తుండగా తల్లి షబానా బేగానికి ఇంటి పైన ఉన్న వాటర్ ట్యాంక్ లో బాలిక మృత దేహం కనిపించింది.
దీంతో తల్లి షబానా బేగం వెంటనే పోలీ సులకు సమాచా రాన్ని అందించింది. ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు పాప చేతులు కాళ్లు కట్టేసి ఉండడంతో ఇంటి సభ్యులే హత్య చేసి ఉంటా రని అనుమానిం చారు. అదే కోణం లో దర్యాప్తు కొనసా గించగా....నిందితుల రంగు బయట పడింది... తల్లి షబానా బేగం కు మరియు ఆమె సోదరుడికి మధ్య గత కొన్నాళ్లుగా ఆస్తి పంపకాల విష యంలో తగాదాలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో షబానా బేగం తన కూతురు సుమ్మయ్య ను తీసుకొని తల్లిగారిం టికి వచ్చింది.
.. ఒక వైపు ఆస్తి పంపకాల తగాదా... మరోవైపు బాలిక ఇంట్లో బాగా అల్లరి చేస్తుంది. దీంతో విసుగు చెందిన మేనమామ, అత్త ఇద్దరు కలిసి పాప కాళ్లు, చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి ఊపిరాడ కుండా చేశారు.. కొన ఊపిరితో కొట్టుమిట్టాలుతున్న పాపను తీసుకువెళ్లి ఇంటి పైన ఉన్న వాటర్ ట్యాంక్ లో పడేశారు. పాపను హత్య చేసి తమ కేమీ తెలియనట్టు నటించారు.. పాప అల్లరి తో పాటు ఆస్తి పంపకాల విష యంలో తేడాలున్న నేపథ్యంలోనే మేనమామ, అత్త కలిసి హత్య చేసిన ట్లుగా పోలీసులు నిర్ధారించారు. పోలీసులు నిందితు లిద్దరిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.