కామా*థుడు డేరా బాబాకు జీవిత ఖైదు.. మ‌ర్డ‌ర్ కేసులో శిక్ష ఖ‌రారు..

డేరా బాబా ఉర‌ఫ్ గుర్మీత్ రామ్ ర‌హీమ్ సింగ్‌. వివాదాస్ప‌ద మ‌త గురువు. డేరా స‌చ్చా సౌదా అధినేత‌. డేరా బాబాగా ఫేమ‌స్ అయిన గుర్మీత్ అఘాయి-త్యాలు అప్ప‌ట్లో సంచ‌ల‌నంగా మారాయి. ఆశ్ర‌మంలో మ‌హిళ‌ల‌పై లై*గిక వేధింపులు క‌ల‌క‌లం రేపాయి. బాబా డెన్‌లో ర‌హ‌స్య గ‌దులు.. బాలిక‌లు.. డ్ర‌గ్స్‌.. క‌*డోమ్స్‌.. ఇలా ర‌క‌ర‌కాల విష‌యాల‌తో డేరా బాబా బాగోతం వెలుగు చూసింది. త‌న బండారం బ‌య‌ట‌ప‌డ‌టానికి ఆశ్ర‌మ మేనేజ‌ర్ రంజిత్ సింగే కార‌ణ‌మ‌ని డేరా బాబా అనుమానించారు. ఆ త‌ర్వాత రంజిత్ సింగ్ హ‌త్య‌కు గుర‌య్యాడు. ఆ మ‌ర్డ‌ర్ కేసులో డేరా బాబాకు తాజాగా జీవిత ఖైదు ప‌డటంతో పాపం పండిన‌ట్టైంది.

2002లో హత్యకు గురైన డేరా సౌదా మేనేజర్‌ రంజిత్ సింగ్ కేసులో డేరా బాబా పాత్ర ఉన్నట్లు హరియాణ పంచకులలోని సీబీఐ న్యాయస్థానం నిర్ధారించింది. బాబాతో పాటు మరో నలుగురికి ఈ హత్యకేసుతో సంబంధం ఉన్నట్లు తేల్చిన కోర్టు.. తాజాగా శిక్ష ఖరారు చేసింది. డేరా బాబాతో పాటు ఆ నలుగురికి కూడా జీవిత ఖైదు విధించింది. ఇక‌, ఓ అత్యా-చార కేసులో డేరా బాబా 2017 నుంచి శిక్ష అనుభవిస్తున్నారు.