క్రికెట్ ఆడుతున్న ఏనుగు.. 

ఏనుగు ఏనుగు నల్లన.. ఏనుగు కొమ్ములు తెల్లన.. ఏనుగు మీద రాముడు.. ఎంతో చక్కని బాలుడు. ఈ పాట అందరికి గుర్తు ఉండే ఉంటుంది. కాలం మారుతున్న కొద్దీ జంతువులు కూడా అప్ డేట్ అవుతున్నాయి. తాజాగా ఒక ఏనుగు క్రికెట్ ఆది తనదైన శైలిలో ఇండియా క్రికెటర్లకు సవాల్ విసురుతుంది.  ఆ ఏనుగు క్రికెట్ ఆడడం చూసిన ప్రముఖ ఇండియా క్రికెటర్లు కూడా స్పందించారు. భలే భలే ఏనుగు. క్రికెట్ ఆడే ఏనుగు గురించి తెలుసుకుందామా..? 

ఆఫ్ సైడ్ ముగ్గురు ఫీల్డర్లని ఉంచిన మావటి.. ఏనుగు కాళ్లపైకి బంతిని విసిరాడు. కానీ. తొండంతో బ్యాట్‌ని పట్టుకున్న ఏనుగు లాఘవంగా ఫీల్డర్ల తలపై నుంచి బంతిని హిట్ చేసింది. ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తొండంతో బ్యాట్‌ని పట్టుకున్న ఏనుగు.. మావటి విసిరిన బంతిని లాఘవంగా హిట్ చేయడం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారగా.. భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ ఫన్నీగా స్పందించారు. కొంత మంది అభిమానులు.. ఇంటర్నేషనల్ క్రికెటర్ల కంటే ఈ ఏనుగు మెరుగ్గా బ్యాటింగ్ చేస్తోందంటూ జోక్‌లు పేలుస్తున్నారు.

ఆఫ్ సైడ్ ముగ్గురు ఫీల్డర్లని ఉంచిన మావటి.. బంతిని విసరగా తొలుత ఫీల్డర్ల ముందు బంతి పడేలా కొట్టిన ఏనుగు.. ఆ తర్వాత బంతిని ఫీల్డర్ల తలపై నుంచి వెనక్కి హిట్ చేసింది. దాంతో.. క్యాచ్ పట్టుకోవడంలో ఆ ఫీల్డర్లు విఫలమయ్యారు. ఏనుగు పక్కన నిల్చొని మరో మావటి దానికి సూచనలు చేస్తూ కనిపించాడు. గతంలో ఓ ఏనుగు ఫుట్‌బాల్ ఆడుతూ కనిపించింది. కానీ.. ఏనుగు క్రికెట్ ఆడటం మాత్రం ఇదే తొలిసారి అని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు.

ఏనుగు క్రికెట్ ఆడటంపై వీరేంద్ర సెహ్వాగ్ ఫన్నీగా స్పందించాడు. ఏనుగు తొండం, కన్ను సమన్వయం పతాకస్థాయిలో ఉందని చెప్పుకొచ్చిన వీరేంద్ర సెహ్వాగ్.. కవర్స్ దిశగా ఆ ఏనుగు కొట్టిన షాట్‌కి ఫిదా అయిపోయాడు. మైకేల్ వాన్ ఏకంగా.. ఆ ఏనుగుకి ఇంగ్లీష్ పాస్‌పోర్ట్ ఉంటుందని జోస్యం చెప్పాడు. దాంతో.. ఇంగ్లాండ్‌కి చెందిన డేవిడ్ మలాన్ టీ20ల్లో చూపిన తెగువ కంటే ఈ ఏనుగు చాలా బాగా ఆడుతోంది. కాబట్టి.. అతని స్థానంలో ఈ ఏనుగుని తీసుకోండి అని ఓ నెటిజన్ చురక అంటించాడు. మొత్తానికీ ఇప్పుడు ఏనుగు క్రికెట్ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాల్ హల్‌చల్ చేస్తోంది.