వేద విశ్వవిద్యాలయంలో మరో రెండు చిరుతలు

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో  చిరుత సంచారం మరోసారి కలకలం రేపుతోంది. ఆదివారం రాత్రి వర్సిటీ ప్రాంగణంలోని ఉద్యోగుల క్వార్టర్స్ సమీపంలోకి చిరుత వచ్చింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమేరాల్లో రికార్డ్ అయ్యాయి.  ఇటీవల అటవీశాఖ అధికారులు ఒక చిరుతను బంధించిన సంగతి తెలిసిందే.

దీంతో ఊపిరి పీల్చుకున్న వర్సిటీ విద్యార్థులు, సిబ్బంది అంతలోనే మరో చిరుత సంచరిస్తుండటంతో తీవ్ర భయాందోళనలకు గురి అవుతున్నారు.  అధికారుల సమాచారం మేరకు ఈ ప్రాంతంలో మరో రెండు చిరుతలు సంచరిస్తున్నాయి. చిరుతలను బంధించేందుకు బోన్లు ఏర్పాటు చేసిన అటవీశాఖ అధికారులు.. రాత్రి వేళల్లో సిబ్బంది, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రాత్రిపూట ఎవరూ బయటకు రావద్దంటూ ఆంక్షలు విధించారు.   

Online Jyotish
Tone Academy
KidsOne Telugu