రాహుల్ వెడ్స్‌ అతియా.. లేటెస్ట్ అప్‌డేట్‌..

కేఎల్ రాహుల్‌కు గోల్డెన్ టైమ్ న‌డుస్తున్న‌ట్టుంది. ప్ర‌స్తుతం సౌతాఫ్రికా టూర్‌లో వ‌న్డే సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా ప్ర‌మోష‌న్ ద‌క్కింది. ఆ జోష్ అలా కంటిన్యూ అవుతుండ‌గానే.. లేటెస్ట్‌గా వెడ్డింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ల‌వ‌ర్ క‌మ్ బాలీవుడ్ బ్యూటీ అతియా శెట్టిని త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోనున్నాడు కేఎల్ రాహుల్. ఈ అప్‌డేట్ ఇటు బాలీవుడ్‌.. అటు క్రికెట్‌వుడ్‌లో ఇంట్రెస్టింగ్‌గా మారింది. 

ఒక‌ప్ప‌టి బాలీవుడ్ స్టార్ సునీల్‌శెట్టి కూతురు అతియా శెట్టి. రాహుల్‌-అతియాలు మూడేళ్లుగా డేటింగ్‌లో ఉన్నారు. వీరి ల‌వ్‌..ఎఫైర్‌.. ఓపెన్ సీక్రెట్‌. అలానే ల‌వ‌ర్స్‌లానే ఎంజాయ్ చేస్తారా.. లేక పెళ్లి కూడా చేసుకుంటారా.. అంటూ ఎప్ప‌టినుంచో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆ స‌స్పెన్స్‌కు ఎండ్‌కార్డ్ వేస్తూ.. వారి వెడ్డింగ్ న్యూస్‌ను వెల్ల‌డించారు. 

తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పగా.. ఇరు కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకారించార‌ట‌. అంటే, సినిమాటిక్ గొడ‌వ‌లు.. నో చెప్ప‌డాలు.. గ‌ట్రా లేవ‌ట‌. వీళ్లు రిచ్‌.. వాళ్లు రిచ్‌.. రాహుల్ క్రికెట్ స్టార్‌.. అతియా బాలీవుడ్ స్టార్‌.. ఇంకేముంటుంది ప్రాబ్ల‌మ్‌. అందుకే, మ్యారేజ్‌కి గ్రీన్‌సిగ్న‌ల్ వ‌చ్చేసింది. వెడ్డింగ్ డేట్ అయితే ఇంకా ఫిక్స్ కాలేదు కానీ.. ఈ ఇయ‌ర్‌లోనే పెళ్లి ఉంటుంద‌ని అంటున్నారు.