కాంగ్రెస్ లోదైర్యం లేని దైన్యం!

ఎన్నిక‌లు రాగానే పార్టీలు రెండింత‌ల‌ ఉత్సాహాన్ని కూడా ప్ర‌ద‌ర్శించ‌డానికి త‌యార‌వుతారు. ప్ర‌స్టుతం తెలంగాణా రాజ‌కీయ వాతావ‌ర‌ణం అంతా మునుగోడు మీద‌నే ఆవ‌హించింది. తాజాగా రాజ‌గోపాల్ రెడ్డి కాంగ్రెస్  వీడి బీజేపీ నీడ‌లోకి వెళిపోవ‌డంతో బెంబేలెత్తిన పార్టీ పైకి ధైర్యం, గంభీర్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని విశ్లేష‌కులు అంటున్నారు.  

నిజానికి మునుగోడులో జ‌రిగేది ఉప ఎన్నికే. కానీ  తెలంగాణాలో అన్ని పార్టీలు దానిమీదే దృష్టి పెట్టాయి.వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఉండబోయే రాజకీయ పరిణామాలను నిర్దేశిం చేది కావడంతో.. ఎంత కాదన్నా, ఎవరు వద్దన్నా అభ్యర్థుల ఎంపికలో చివరకు ఆర్థికబలం కూడా అదన పు అర్హతగా చేరిం ది. టీఆర్‌ఎస్‌లో  ఆర్థిక అంశం పెద్ద విషయం కాకపోయినా, అధికారంలో ఉన్న పార్టీగా నిధులకు కొరత ఉండే అవకాశం ఏమాత్రం లేకపోయినా.. ఉన్నవారిలో ఆర్థికంగా బలంగా ఉన్న అభ్యర్థినే ఎంపిక చేస్తారన్న వాదన ఉంది. 

రేసులో ఉన్న మరో నేత గుత్తా సుఖేందర్‌రెడ్డి శాసన మండలి చైర్మన్‌గా ఉన్నందున ఆయనను  ఉప ఎన్నిక బరిలోకి దించే ఆలోచనను అధినాయ కత్వం చేయలేదని తెలుస్తోంది. వారిని చూసి వీరు, వీరిని చూసి వారు అన్న ట్టు ఇపుడు కాంగ్రెస్‌లోనూ అభ్య‌ర్ధి ఎంపిక‌కు ఆర్ధిక అంశాన్ని ఒక కండీషన్ గా నిర్దేశించుకోవడం  గ‌మ‌నార్హం. 

ఇదిలా ఉండ‌గా,  ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ శిబిరంలో చేరిపోయిన రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ ను  ఖాళీ చేసే పనిలో భాగంగా మండలాల వారీగా ఇప్పటికే సమావేశాలు ఏర్పాటు చేసి ఆపరేషన్ ఆకర్ష్ అంటున్నారు. ఈ సమావే శాలకు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 90 శాతం మంది నేతలు హాజరవుతున్నారని చెబుతున్నారు. వారికి భరోసా ఇచ్చి క్షేత్ర స్థాయిలో కార్యక్రమాలు చేపట్టాలంటే డబ్బు అంశమే ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయ సాధన కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అందుకే   అభ్యర్థి పేరు ప్రక టించకుం డా సమావేశాలు, మండలాల్లో అభిప్రాయ సేకరణ పేరుతో కొంత ప్రశాంత వాతావరణం నెల కొల్పి నెలా ఖరుకు అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల సమాచారం.

మునుగోడులో కాంగ్రెస్‌ టికెట్‌ కోసం పోటీపడుతున్న ఆశావహులు, ముఖ్య నాయకులతో ఏఐసీసీ కార్యద ర్శి బోసు రాజు బుధవారం (ఆగ‌ష్టు 10న‌)గాంధీ భవన్‌లో సమావేశమయ్యారు. ఎన్నికలో విజయం కోసం అవలంబించా ల్సిన వ్యూహంపై చర్చించారు.  పార్టీ అధిష్ఠానమే అభ్యర్థిని ఖరారు చేస్తుందని చెప్పారు. సర్వేలు, గ్రామస్థాయిలో ప్రజాభిప్రాయ సేకరణ పూర్తైన తర్వాతనే అభ్యర్థి ఎంపిక ఉంటుందన్నారు.