జూబ్లీహిల్స్‌లో ఒకే ఇంట్లో 43 దొంగ ఓట్లు : కేటీఆర్
posted on Oct 13, 2025 3:32PM

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒకే ఇంట్లో 43 దొంగ ఓట్లును కాంగ్రెస్ వాళ్ళు రాయించారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. జూబ్లీహిల్స్‌లోని రహమత్‌నగర్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలాగో కాంగ్రెస్‌కి ప్రజలు ఓటేయ్యరని గుర్తించి దొంగ ఓట్లును రాయించారని కేటీఆర్ అన్నారు. ఫేక్ ఓట్లను ఎలా ఎదర్కోవాలో అలా ఎదుర్కొంటాం అని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క ముస్లిం ఎమ్మెల్యే లేడు, ఒక్క ముస్లిం ఎమ్మెల్సీ లేడని...అజారుద్దీన్‌ను జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నిలబడనీయకుండా ఒక పేపర్ మీద ఎమ్మెల్సీ అని రాసి బకరాను చేశాడని కేటీఆర్ విమర్శరించారు. అజారుద్దీన్‌కు ఇచ్చిన ఎమ్మెల్సీ పోస్ట్ కోర్టులో నిలబడదు.. ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డికి కూడా తెలుసని కేటీఆర్ పేర్కొన్నారు.
షేక్‌పేట్‌లో ముస్లింలకు శ్మశాన వాటిక స్థలం అని ఇచ్చాడు.. అది ఆర్మీ వాళ్లు వచ్చి మాది అని గుంజుకున్నారని జీహెచ్ంఎసీ ఎన్నికల తర్వాత కేసీఆర్ ప్రవేశపెట్టిన ఫ్రీ వాటర్ స్కీం కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎత్తేస్తారని తెలిపారు. ఎందుకంటే మాకు ఒక్క సీటు ఇవ్వలేదని కాంగ్రెస్ వాళ్ళు హైదరాబాద్ మీద పగపట్టారని కేటీఆర్ ఆరోపించారు