ఉప్ప‌ల్‌లో  రెచ్చిపోయిన కింగ్ కోహ్లీ, సూర్య‌.. భార‌త్ విజ‌యం

చాలా రోజుల త‌ర్వాత హైద‌రా బాద్ క్రికెట్ అభిమానుల‌కు ఆదివారం భార‌త్‌, ఆస్ట్రేలియా మ్యాచ్ పండ‌గ ఆనందాన్ని చ్చింది. మూడు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు గెలిచి భార‌త్ ఈ సిరీస్ కైవ‌సం చేసుకుంది. నాగ‌పూర్‌లో జ‌రిగిన మ్యాచ్‌లో సునాయా సంగా గెలిచిన భార‌త్ హైద‌రాబాద్‌ లోనూ పెద్ద‌గా క‌ష్ట‌ప‌డ‌కుండానే గెలిచింది. ముఖ్యంగా కోహ్లీ, సూర్య‌కుమార్ యాద‌వ్‌, పాండ్యా ల వీర‌బాదుడుతో ఆసీస్పై ఆరు వికెట్ల తేడాతో భార‌త్ మూడో మ్యాచ్ గెలిచింది. ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మ‌న్ గ్రీన్‌, టిమ్ డేవిడ్‌లు విజృం భించి ఆడ‌టంతో 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 186 ప‌రుగులు చేసింది. ముఖ్యంగా గ్రీన్ అద్బుత బ్యాటింగ్ నైపుణ్యంతో కేవ‌లం 21 బంతుల్లో 52 ప‌రుగులు చేసి ప్రేక్ష‌కుల‌ను అల‌రించాడు.
మొద‌ట బ్యాట్ చేసిన ఆసీస్ ఆరంభం నుంచే ఫించ్, గ్రీన్‌లు వీరావేశంతో ఆడేరు. భార‌త్ పేస‌ర్ల ప‌ని ప‌ట్టార‌నాలి. సునాయాసంగా ఫోర్లు కొట్ట‌డంతో వారిని అడ్డుకునేందుకు చేసిన య‌త్నాలు విఫ‌లమ‌య్యాయి. మొద‌టి 3 ఓవ‌ర్ల‌లోనే 35 ప‌రుగులు దంచారు. నాలుగో ఓవ‌ర్లో స్పిన్న‌ర్ అక్ష‌ర్ ఆసీస్ కెప్టెన్‌ను పెవిలియ‌న్ దారి ప‌ట్టించాడు. అప్ప‌టికి కాస్తంత ఊపిరిపీల్చుకున్నారు. ఫించ్ 7 ప‌రుగులే చేసాడు.కానీ మ‌రో ఎండ్‌లో గ్రీన్ వీర‌బాదుడు కొన‌సాగించి 50 ప‌రుగులు పూర్తిచేశాడు. కాగా 5వ ఓవ‌ర్ భువీ చేతిలో గ్రీన్ వెనుదిరిగాడు. గ్రీన్ కేవ‌లం 19 బంతుల్లో 52 దంచాడు. ప‌వ‌ర్ ప్లే పూర్త‌య్యే స‌రికి ఆసీస్ 2 వికెట్ల న‌ష్టానికి 66 ప‌రుగుల చేసింది. త‌ర్వాత వ‌చ్చిన స్మిత్ మొద‌టి బాల్ నుంచి ఎంతో దూకుడుగా ఆడి జ‌ట్టుస్కోర్ 71కి చేర్చాడు. ఆ త‌ర్వాతి ఓవ‌ర్లో మాక్స్ వెల్ ని చాహ‌ల్ అవుట్ చేయ‌డంతో ఇక పెద్ద‌గా భారీ షాట్స్ ఆడేవారు ఉండ‌ర‌న్న ధైర్యం వ‌చ్చింది. ప‌దో ఓవ‌ర్లో స్మిత్ కూడా  వెనుదిర‌గ‌డం బౌల‌ర్ల విజ‌యంగా భావించాలి. స్మిత్ 9 ప‌రుగులేచేశాడు. 10 ఓవ‌ర్ల‌కి ఆసీస్ 4 వికెట్ల న‌ష్టానికి 86 ప‌రుగు లు చేసింది. 12ఓవ‌ర్లో ఆసీస్ 100 రుగులు పూర్తిచేసింది. కాగా, అక్ష‌ర్ వేసిన 14ఓవ‌ర్లో రెండు వికెట్లు తీయ‌డంతో ఆసీస్ భారీ స్కోర్ అవ‌కాశాలు త‌గ్గాయ‌నాలి. అంత‌కుముందు మ్యాచ్‌లు ధాటిగా ఆడిన వేడ్ కేవ‌లం ఒక్క‌ప‌రుగుకే వెనుదిర‌గ‌డం ఆశ్చ‌ర్య ప‌రిచింది. ఆసీస్ 15 ఓవ‌ర్ల‌కి 6 వికెట్ల న‌ష్ట‌పోయి 123 ప‌రుగులు చేసింది. అయితే చివ‌ర్లో సామ్స్‌, డేవిడ్‌లు ఎంతో నిల‌క‌డ‌గా ఆడి 28 బంతుల్లో 56 పుగులుచేసి జ‌ట్టు స్కోరు 180కి చేర్చ‌గ‌లిగారు. 19వ ఓవ‌ర్లో బుమ్రా ఊహించ‌నివిధంగా ఏకంగా 18 ప‌రుగులు ఇచ్చి నిరాశ‌ప‌రిచాడు. చివ‌రిది 20వ ఓవ‌ర్లో డేవిడ్ వెనుదిరి గాడు.  డేవిడ్ 54 రుగులు చేశాడు. 

187 ప‌రుగుల ల‌క్ష్యంతో బ్యాటిం గ్‌కి దిగిన భార‌త్ మొద‌టి ఓవ‌ ర్లోనే రాహుల్ వెనుదిరిగాడు. అత‌ను ఒక్క ప‌రుగే చేశాడు. 4వ ఓవ‌ర్లో కెప్టెన్ శ‌ర్మ వెనుదిరిగాడు. శ‌ర్మ 14 బంతుల్లో 17 రుగులు చేశాడు. అప్ప‌టికి జ‌ట్టు స‌కోర్ 2 వికెట్ల న‌ష్టానికి 30 ప‌రుగులే ఉంది. 6 ఓవ‌ర్లు పూర్త‌య్యే స‌రికి భార‌త్ 2 వికెట్ల న‌ష్టానికి 50 ప‌రుగులు చేసింది. అక్క‌డ నుంచి కింగ్ కోహ్లీ, డాషింగ్ బ్యాట్స్‌మ‌న్ సూర్య‌కుమార్ రెచ్చి పోయి ఆడారు. ఆసీస్ బౌల‌ర్ల‌కు ఏమాత్రం అంద‌కుండా వీర బాదు డుతో జ‌ట్టుస్కోరును ప‌రు గులు పెట్టించారు. కోహ్లీ చూస్తుండ‌ గానే సూర్య వేగంగా ప‌రుగులు చేయ‌డం గ‌మ‌నార్హం. 11వ ఓవ‌ర్‌ కొ భార‌త్ 100 ప‌రుగులు పూర్తి చేసింది. 13వ ఓవ‌ర్లో సూర్య‌ కుమార్ వెనుదిరిగాడు. అప్ప‌టికి అతను కేవ‌లం 29 బంతుల్లోనే 50 ప‌రుగులు చేశాడు. కోహ్లీ, సూర్య‌ల జోడి 61 బంతుల్లో 104 ప‌రుగులు చేయ‌డం ప్రేక్ష‌కు లకు ఫుల్ పైసా వ‌సూల్ అయిం ది. సూర్య స్థానంలో వ‌చ్చిన పాండ్యా వ‌స్తూనే దూకుడుగా ఆడాడు. 14వ ఓవ‌ర్‌కి భార‌త్ 134 ప‌రుగులు చేసింది. 15 ఓవ‌ర్లు పూర్త‌య్యేస‌రికి భార‌త్ 3 వికెట్ల న‌ష్టానికి 143 ప‌రుగులు చేసింది. ఇన్నింగ్స్ 16వ ఓవ‌ర్లో కోహ్లీ అర్ధ‌సెంచ‌రీ పూర్తి చేశాడు. కింగ్ త‌న అర్ధ‌సెంచ‌రీని 31 బంతుల్లో చేశాడు. కాగా 18వ ఓవ‌ర్ క‌మిన్స్ వేసిన ఓవ‌ర్లో భార‌త్ అత్య‌ధికంగా 21 పరుగులు సాధించింది. పాండ్యా వీర‌బాదుడుతో క‌మిన్స్‌కు ఏమీ అర్ధంకాలేదు. 19వ ఓవ‌ర్లో 11 ప‌రుగులు వ‌చ్చాయి. 20 ఓవ‌ర్లో రెండో బంతికి కోహ్ల వెనుదిర‌గ‌డంతో ప్రేక్ష‌కులు కాస్తంత ఖంగారు ప‌డ్డారు. కింగ్ 48 బంతుల్లో 63 ప‌రుగులు చేశాడు.  అత‌ని స్థానంలో ఫినిష‌ర్ కార్తీక్ వ‌చ్చాడు. కానీ అప్ప‌టికే పాండ్యా మంచి దూకుడు మీద ఉండ‌డంతో జ‌ట్టు విజ‌యానికి కావ‌ల‌సిన ప‌రుగులు అత‌నే చేయ‌గ‌లిగాడు. పాండ్యా 16 బంతుల్లో 25 ప‌రుగుల చేసి అజేయంగా నిలిచాడు. ఈ విజ‌యంతో ఈ సిరీస్ 2-1 తేడాతో భార‌త్ కైవ‌సం చేసుకుంది.