మెకానిక్‌ నుంచి మినిస్ట‌ర్ వ‌ర‌కూ.. కొడాలి నాని బ్యాక్‌గ్రౌండ్ ఇదే..

ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని పేరు ప్రస్తుతం అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అవుతోంది. గుడివాడ ఎమ్మెల్యేగా ఆయన చాలా కాలంగా పని చేసినా.. జగన్ కేబినెట్‌లో మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత.. మంత్రిగా ఆయన ప్రెస్ మీట్లు పెట్టి.. వినిపించే బూతుల పంచాంగంతో కొడాలి నాని పేరు  అలా ఇలా కాదు.. ఓ రేంజ్‌లో పాపులర్ అయిందీ. అయితే తాజాగా సంక్రాంతి సందర్భంగా గుడివాడలో కొడాలి నానికి చెందిన కె కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన క్యాసినో వ్యవహారం కాస్తా... సదరు మంత్రిగారికి పికకు చుట్టుకునేలా ఉందనే కామెంట్స్  సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి.  

అసలు కొడాలి నాని ఎవరు.. ఆయన ఎక్కడి నుంచి వచ్చారు. ప్రస్తుతం ఆయన వెలుగుతున్న ఈ వెలుగుల వెనుక  ఎవరు ఉన్నారంటే మాత్రం ఓ సారి వెనక్కి వెళ్లాలి... కృష్ణాజిల్లా గుడివాడలోని ఆటోనగర్‌లో కొడాలి నాని తండ్రికి మెకానిక్ షెడ్ ఉండేదని.. అయితే కొడాలి నాని.. స్వతహాగా పుస్తకం అంటే ఎలర్జీ అని.. ఆ క్రమంలో కొడాలి నాని.. పదవ తరగతికి ఫుల్ స్టాప్ పెట్టేశారని.. ఆ తర్వాత ఆయన పుస్తకం పట్టిందేలేదంటారు ఆయన చిన్ననాటి స్నేహితులు. ఆ క్రమంలో తండ్రికి చెందిన లారీ మెకానిక్ షెడ్‌కే కొడాలి నాని పరిమితమై... లారీనీ ఏ కీలుకాకీలు విప్పి..  వాటిని బిగించడంలో కొడాలి నాని మాంచీ నేర్పు సాధించాడంటారు.  

అదే సమయంలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు.. తెలుగుదేశం పార్టీని స్థాపించి.. అటు గుడివాడ, ఇటు తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆయన రెండు చోట్ల నుంచి గెలుపొందారు. ఆ సమయంలోనే గుడివాడలో కొడాలి నానికి నందమూరి హరికృష్ణతో కొంత పరిచయం ఏర్పడి.. అది కాస్తా స్నేహంగా మారిందని.. ఆ తర్వాత నందమూరి హరికృష్ణ ఉత్తరాంధ్రలో మైనింగ్ వ్యాపారం చేస్తుంటే.. అందులోకి సైతం కొడాలి నాని ఎంట్రీ ఇచ్చి.. కొద్దో గొప్పో సంపాదించాడంటారు. ఇక గుడివాడ కేంద్రంగా ఆ చుట్టుపక్కల పల్లెటూళ్లకు కొడాలి నాని సిటీ బస్సులను తిప్పే వారన్న సంగతి అందరికీ తెలిసిందే.  
 
అంతేకాకుండా కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా కొడాలి నానిని హరికృష్ణ దగ్గరుండి మరి నియమించారని.. ఆ తర్వాత.. జూనియర్ ఎన్టీఆర్.. గుంటూరులో చదువుకోవడం.. ఈ సమయంలో అతడి మంచి చెడ్డలన్నీ కొడాలి నానినే స్వయంగా చూసుకునేవాడని సమాచారం. ఇక ఎన్టీఆర్ మరణం అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో అన్న తెలుగుదేశం పార్టీ తరఫున గుడివాడ అసెంబ్లీ స్థానం నుంచి నందమూరి హరికృష్ణ  పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో నందమూరి హరికృష్ణకు కేవలం 11 వేల ఓట్లు మాత్రమే పోలైనాయి. 

ఇక, 2004లో జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ సిఫార్సుతో గుడివాడ సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని.. కొడాలి నానికి ఎమ్మెల్యే సీటు ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఈ ఎన్నికల్లో కొడాలి నాని 7 వేల ఓట్లతో గెలుపొందారు. మళ్లీ 2009లో సైకిల్ పార్టీ టికెట్‌పై అదే నియోజకవర్గం నుంచి కొడాలి నాని విజయం సాధించారు. అయితే 2012లో కొడాలి నాని సైకిల్ పార్టీకి రాజీనామా చేసి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

జగన్ కేబినెట్‌లో మంత్రి పదవిని చేపట్టిన తర్వాత అయితే... కొడాలి నాని దూకుడు మ‌రింత పెరిగింది. లేటెస్ట్‌గా గుడివాడలోని కొడాలి నానికి చెందిన కె కన్వెన్షన్ సెంటర్‌లో సంక్రాంతి సందర్భంగా క్యాసినో నిర్వహించారంటూ.. సోషల్ మీడియాలో వీడియోలు.. ఓ రేంజ్‌లో హల్ చల్ చేస్తున్నాయి. గుడివాడ‌లో గోవా క‌ల్చ‌ర్ తీసుకొచ్చి.. మ‌హ‌నీయుల నేల‌ను అబాసుపాలు చేశారంటూ స్థానికులు మండిప‌డుతున్నారు. మంత్రి కొడాలి నాని మాత్రం అలాంటిదేమీ జరగలేందంటూ బుకాయిస్తున్నారు. రోటీన్‌గా బూతులు దండ‌కం అందుకున్నారు. ఏమైనా మంత్రిగారు చదివింది పదో క్లాస్.. అలా కాక ఇంకెలా చెబుతారంటూ.. గుడివాడ వాసులు గునుగుతున్నారు.