అడవి పందులను చంపి తినేందుకు పర్మిషన్ ఇవ్వాలి : కేరళ మంత్రి
posted on Oct 11, 2025 5:50PM

అడవి పందులను బెడదతో పంట పొలాలు నాశనమవుతున్నాయని కేరళ వ్యవసాయశాఖ మంత్రి ప్రసాద్ అన్నారు. వాటిని చంపి తినేందుకు అనుమతి ఇస్తే సమస్య తగ్గే అవకాశం ఉందని మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రస్తుతం చట్టం దానిని అనుమతించలేట్లదని ఆయన గుర్తు చేశారు. పాలమేల్ గ్రామ పంచాయతీ నిర్వహించిన ఓ కార్యక్రమానికి కేరళ వ్యవసాయ మంత్రి హాజరయ్యారు.
అడవి పందులు అంతరించిపోతున్న జాతి కాదని పేర్కొన్నారు. వైల్డ్‌లైప్ ప్రొటెక్షన్ యాక్ట్-1972 ప్రకారం వన్యప్రాణుల వేట చట్ట విరుద్దం. ఈ విధంగా చేస్తేనే అడవి పందుల సమస్యను వేగంగా పరిష్కరించి, పంటలను కాపాడుకోగలమని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. వాటిని చంపకుండా ఉండాలని చెప్పేందుకు అడవి పందులేమీ అంతరించిపోతున్న జాతి కూడా కాదని ఆయన పేర్కొన్నారు.