రాజ్‌భ‌వ‌న్ ఎట్ హోమ్ కార్య‌క్ర‌మానికి కేసీఆర్ డుమ్మా

తెలంగాణా గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై రాజ్‌భ‌వ‌న్ లో నిర్వ‌హించే ఎట్ హోమ్ కార్య‌క్ర‌మానికి సీఎం కేసీఆర్ గైర్హాజ‌ర‌య్యారు. కేసీఆర్ హాజ‌ర వుతార‌ని రాజ్‌భ‌వ‌న్ వ‌ర్గాలకు సీఎంఓ స‌మాచారం పంపింది. కానీ ఆయ‌న వెళ్ల‌క‌పోవ‌డంతో టీఆర్ ఎస్ నాయ‌కులు, ప్ర‌తినిధులు కూడా వెళ్ల‌లేదు. ఛీఫ్ సెక్ర‌ట‌రీ సోమేశ్ కుమార్‌, హైద‌రాబాద్ సీపీ ఆనంద్‌, రాచ‌కొండ సీపీ మ‌హేష్ భ‌గ‌వ‌త్ మాత్ర‌మే హాజ‌ర య్యారు. గ‌వ‌ర్న‌ర్ , కేసీఆర్ చివ‌ర‌గా హైకోర్టు ఛీఫ్ జ‌డ్జి ఉజ్జ‌ల్ భూయాన్ ప్ర‌మాణ‌స్వీకార కార్య‌క్ర‌మంలోనే పాల్గొన్నారు. అప్పుడు మాట్లాడుకున్నారు. వారి మ‌ధ్య ఎలాంటి విభేదాలు లేవ‌ని అంతా అనుకున్నారు.  కాగా క‌రోనా కార‌ణ‌గా తేనేటి విందుకు హాజ రు కాలేకోతున్నాన‌ని టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. కాగా పాద‌యాత్ర‌లో బిజీ గా ఉన్న తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు బండి సంజ‌య్ గ‌వ‌ర్న‌ర్ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌లేన‌ని తెలియ‌జేశారు. కరోన కారణం గా రెండు సంవత్సరాలుగా రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమాన్ని నిర్వహించలేదన్న‌ది తెలిసిన‌దే. 

2020 జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున ఒకే ఒక్కసారి కేసీఆర్ రాజ్‌భవన్‌లో ఎట్‌హోమ్‌కి వెళ్లారు. ఆ తర్వాత కరోనా కార ణంగా 2021లో ఆగస్ట్ 15న గానీ, జనవరి 26న గానీ ఆనవాయితీ కొనసాగలేదు. 2022 జనవరి 26న ఎట్‌హోమ్‌కి కేసీఆర్ హాజరు కాలేదు. 2020లో జరిగిన ‘ఎట్ హోమ్‌ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. గవర్నర్ తమిళిసైకి, సీఎం కేసీఆర్‌కు మధ్య గ్యాప్ పెరిగిందనే ప్రచారానికి గత జూన్ నెలలోనే ఫుల్‌స్టాప్ పడింది. తొమ్మిది నెలలు రాజ్‌భవన్ వైపు కన్నెత్తి చూడని కేసీఆర్ హైకోర్టు కొత్త సీజే ప్రమాణ స్వీకారోత్సవ సందర్భంగా రాజ్‌భవన్‌కు వెళ్లారు. గవర్నర్ తమిళిసైని ఆప్యాయంగా పలక రించారు.

ఇదిలా ఉండగా, ఈ పరిణామం చోటు చేసుకున్న కొన్ని రోజుల తర్వాత సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి రాకపోవచ్చని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తమిళిసై హాజర యిన సందర్భంలో ఆ కార్యక్రమం ముగిసిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర రాజకీ యాల్లోకి రావాలన్న ఆలోచనతోనే కేసీఆర్‌ పదే పదే ప్రధాని మోదీపై ఆరోపణలు చేస్తున్నారా.. అని విలేకరులు ప్రశ్నించగా ఆమె.. ‘ ఆ అవకాశం లేదు’ అన్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రాకపోవచ్చని అభిప్రాయపడ్డారు.  ప్రజా సేవకు రాలిని. ప్రజలకు దగ్గరగా ఉండటం నా నైజం. గవర్నర్‌ అయినంత మాత్రాన రాజ్‌భవన్‌కే పరిమితం కాను. ఇతర రాష్ట్రాల గవ ర్నర్లతో నన్ను పోల్చవద్దన్నారు.  కేసీఆర్‌ ఎప్పుడూ నా సోదరుడే. నేను ఎప్పడూ ఆయనకు సోదరినేన‌ని ఆ సందర్భంలో వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలను గమనిస్తే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, గవర్నర్ తమిళిసైకు సహృద్భావ వాతా వరణమే ఉందని స్పష్టమవుతోంది.