కుట్రలు చేసి నిజామాబాద్‌లో ఓడగొట్టారు : కవిత
posted on Oct 25, 2025 8:33PM
.webp)
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జాగృతి జనం బాట కార్యక్రమం నిజామాబాద్ జిల్లాలో ప్రారంభించారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా నా మెట్టినిల్లు... ఎంపీగా ఎమ్మెల్సీగా నాకు పట్టం కట్టి నా రాజకీయ జీవితానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడానికి ఇక్కడి నుంచే "జాగృతి జనం బాట" ను ప్రారంభించడం సముచితంగా భావించాని ఆమె పేర్కొన్నారు.
అంతే ఉత్సాహంతో నన్ను స్వాగతించి అక్కున చేర్చుకున్న ఇందూర్ జిల్లా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, ఘన స్వాగతం పలికిన యువతకు నిండు హృదయంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాని కవిత అన్నారు. గత 20 ఏళ్లుగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో, బీఆర్ఎస్ పార్టీ కోసం అంకితభావంతో పనిచేశాను. 27 ఏళ్ల వయసులోనే తెలంగాణ ఉద్యమంలోకి అడుగుపెట్టాను. ఎన్నో అవమానాలు ఎదురైనా ఓపికతో భరించాను," అని గుర్తుచేసుకున్నారు.
ఇందూర్‌లో తన ఓటమి వెనుక పెద్ద కుట్ర జరిగిందని ఆరోపించిన కవిత, "ఏం జరిగిందో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆలోచించాలి. జరిగిన కుట్ర గురించి పిల్లల్ని అడిగినా చెబుతారు" అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై తన ప్రయాణం ప్రజలతోనే అని స్పష్టం చేశారు. తన భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. "తెలంగాణ రాష్ట్రం వచ్చి పదేళ్లు గడిచినా అమరవీరుల కుటుంబాలకు సరైన గౌరవం, న్యాయం దక్కలేదు. వారి కోసం పోరాడాల్సిన అవసరం ఉంది.
వారి కోసం పోరాడాల్సిన అవసరం ఉంది. ఈ 'జనం బాట'లో భాగంగా మేధావులు, విద్యార్థులు, రైతులు సహా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడతాని ఆమె పేర్కొన్నారు. అందరి భాగస్వామ్యంతో ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ధి సాధించడమే నా లక్ష్యం" అని తెలిపారు. జాగృతి సంస్థ ద్వారా విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత వంటి రంగాల్లో సేవలు కొనసాగిస్తానని కవిత ప్రకటించారు