ఫ్రంట్ లైన్ వారియర్స్ పై వివక్షా!  జగన్ సర్కార్ పై కాపునాడు ఫైర్  

కరోనా సమయం లో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేస్తున్న జర్నలిస్టులు పట్ల ప్రభుత్వం వివక్ష చూపడం సరి కాదని సౌత్ ఇండియన్‌ కాపు అసొసియేషన్ ప్రధాన కార్య దర్మి , ఏపీ రాష్ట్ర అధ్యక్షులు వేల్పూరి శ్రీనివాస రావు విమర్శించారు. జర్నలిస్టుల సమస్యలు, అందించాల్సిన సాయంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. సొంత మీడియ సాక్షి కోసం జర్నలిజం వ్యవస్థను సర్వ నాశనం చేయటం మానుకోవాలని హితవు పలికారు శ్రీనివాస రావు. 

నిజమైన జర్నలిస్టులకు గుర్తింపు ఇవ్వకపోవడం , మూడు సంవత్సరాలుగా  ఆక్రి డేషన్‌ మంజూరు చేయకపోవడంపై శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. హెల్త్ కార్డులు పంపిణి చేయకపోవడం , ప్రమాద ఇన్సురెన్సు చెల్లించక పోవడంతో చాలా మంది జర్నలిస్టులు ఇబ్బందులు పడ్డారని చెప్పారు. బస్ పాస్ , రైల్వే పాస్ సౌకర్యం కల్పించ కుండా జర్నలిస్టులను నరక యాతన కు గురి చేయటం మీ సర్కార్ కుట్ర లో భాగం కాదా అని ముఖ్యమంత్రిని వేల్పూరి ప్రశ్నించారు . కరోనా కాటుకు సుమారు 50 మంది చనిపోయారని వేల్పూరి ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సోకి చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పేద జర్నలిస్టులందరికి 5 వేలు ఆర్థిక సాయం , మరణించినవారికి 50 లక్షలు ప్రకటించాలని వేల్పూరి CM ను డిమాండ్ చేశారు. 

జర్నలిస్టులకు ఇళ్ళస్థలాలు ఇస్తామని హామి ఇచ్చి మోసం చేశారని శ్రీనివాస రావు మండిపడ్డారు. సమాచార ప్రసార శాఖ ఉన్నా కూడా జర్నలిస్టుల సమస్య ల పట్ల మొసలి కన్నీరు కార్చటం సిగ్గుచేటని సీఎంకు రాసిన లేఖలో శ్రీనివాసరావు విమర్శించారు.  యాజమాన్యాల ఉన్న  వ్యక్తిగత గొడవలకి జర్నలిస్టులను బలి చేయటం తగదని ముఖ్యమంత్రికి సూచించారు. ప్రభుత్వ పధకాల ప్రకటనల్లో తన కుటుంబ పత్రిక సాక్షికి 100 కోట్ల రూపాయలు ఇవ్వడం , ఇతర రాష్ట్రాల ప్రభుత్వ అనుకూల పత్రికలకు కోట్ల రూపాయలు ప్రకటనలు ఇచ్చారని ఆరోపించారు.కాని ఏపీ  రాష్ట్రంలో చిన్న పత్రికలకు మొండి చెయ్యి చూపటం దురదృష్టకరమన్నారు. సాక్షి పత్రిక , సాక్షి  Tv కోసం, జర్నలిస్టు వ్యవస్థ ను విచ్చిన్నం చేయవద్దని, జర్నలిస్టులు ఆత్మ గౌరవం కలవారని , తాడేపల్లి రాజమహాల్లో పాలేరులు కాదని CM కి వేల్పూరి హితవు పలికారు.జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఏ పోరాటం చేయటానికైనా కాపునాడు సిద్ధంగా ఉందని ప్రకటించారు.