ఆమెపై కాజల్ నోటి దురద
posted on Nov 6, 2013 9:34AM

"మగధీర" చిత్రంతో హీరోయిన్ గా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న కాజల్ కు ఈ మధ్య తెలుగులో సరిగ్గా అవకాశాలేమి అంతంత మాత్రంగానే ఉన్నాయి. అయితే ఇటీవలే ఈ అమ్మడు తమిళంలో కార్తి హీరోగా రానున్న ‘ఆల్ ఇన్ ఆల్ అళగు రాజా’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన టీవీ ప్రమోషన్ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పి అక్కడి వారందరిని షాక్ కి గురిచేసింది.
"మీ దృష్టిలో ఏ హీరోయిన్ రిటైర్ అయితే బెటర్"అని యాంకర్ ప్రశ్న వేసింది. దాంతో ఆలోచించకుండా వెంటనే శ్రియ అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. దాంతో అక్కడున్న హీరో కార్తితోపాటు చాలామంది ఖంగుతిన్నారు. అంతే కాకుండా దీనిని అలాగే టెలికాస్ట్ చేసేసారు. దాంతో ఈ విషయం శ్రియ వరకూ వెళ్లింది. కాజల్ ఈ విధంగా మాట్లాడటంతో శ్రియ కూడా అంతేస్థాయిలో రియాక్ట్ అయ్యిందని తెలిసింది. ప్రస్తుతం ఈ టాపిక్ అటు కోలీవుడ్ తో పాటు, టాలీవుడ్ లో కూడా హాట్ టాపిక్ గా మారింది. మరి కాజల్ నోటి దురదకు శ్రియ ఎలా స్పందించనుందో మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది.