సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం

దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్  సోమవారం (నవంబర్ 24) ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ, పలువురు కేంద్ర మంత్రులు, సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాదులు హాజరయ్యారు.

ఇలా ఉండగా సుప్రీం కోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన సూర్యకాంత్ ఆ పదవిలో  2027 ఫిబ్రవరి 9 వరకూ కొనసాగుతారు. సీజేఐగా ప్రమాణ స్వీకారం చేసిన సూర్యకాంత్  స్వస్థలంహర్యానా. హర్యానా నుంచి సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తొలి వ్యక్తి జస్టిస్ సూర్యకాంత్.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu