ప్రశాంతంగా జూబ్లీ ఉప ఎన్నిక పోలింగ్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.  మంగళవారం (నవంబర్ 11) ఉదయం ఏడుగంటలకు పోలింగ్ మొదలైంది. సాయంత్రం ఆరు గంటల వరకూ పోలింగ్ కొనసాగుతుంది. ఈ ఉప ఎన్నికలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 58 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ  ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ ఉంది. ఈ పోలింగ్ పరిశీలన, పర్యవేక్షణకు తొలి సారిగా డ్రోన్లను వినియోగిస్తున్నారు.  జూబ్లీ బైపోల్ కోసం మొత్తం 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

వీటిలో  226 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించిన అధికారులు పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇలా ఉండగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఎల్లారెడ్డిగూడలోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆమె పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ యూసుఫ్ గూడలోని ప్రభుత్వ పాఠశాల పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu