జూబ్లీహిల్స్‌లో ఓటుకు రూ.10 వేలు : కేటీఆర్
posted on Oct 12, 2025 4:18PM

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ప్రజలు కారు కావాలా.. బుల్డోజర్ కావాలా నిర్ణయించుకోవాలని ఆయన సుచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. హైదరాబాద్ షేక్‌పేట డివిజన్‌కు చెందిన సీనియర్ నాయకుడు చెర్క మహేశ్.. తెలంగాణ భవన్‌లో కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. . కాంగ్రెస్ గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారని.. రాష్ట్రంలో రెండేళ్లుగా అధికారంలో ఉన్నది ఎవరని ఆయన ప్రశ్నించారు.
ఈ ఎన్నికల్లో బుద్ధి చెబితేనే కాంగ్రెస్ పార్టీకి సోయి వస్తదని అన్నారు. రెండేళ్లలో సంపాదించిన మొత్తం అవినీతి సొమ్మును జూబ్లీ ఎన్నికల్లో ఖర్చు పెడతారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఓటుకు రూ.10 వేలు కూడా ఇస్తామంటారని తెలిపారు. బీజేపీ తెలంగాణకు పనికిరాని పార్టీ అని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీకి ఓటు వేస్తే మోరీలో వేసినట్లే అని అన్నారు.
హైదరాబాద్‌లో అభివృద్ధి తిరిగి గాడిన పడాలంటే మళ్లీ మాజీ సీఎం కేసీఆర్ మళ్లీ రావాల్సిందే అని మాజీ మంత్రి అన్నారు. అది జూబ్లీహిల్స్ నుంచి మొదలు కావాల్సిందే అన్నారు. అప్పుడే ఎన్నికల హామీల అమలులో చేసిన మోసంతో ప్రజలు కోపంగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకుంటుందన్నారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓడిపోతేనే నెలకు రూ.4వేల పెన్షన్ వస్తుందని.. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలన్నీ అమలవుతాయని స్పష్టం చేశారు. అదే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే.. ప్రజలను.. ఎంత మోసం చేసినా ప్రజలు ఏమీ అనరనే ధీమాలోకి వెళ్లిపోతారని కేటీఆర్ తెలిపారు.