జూబ్లీ ఉప ఎన్నికల్లో 300 మంది మాలల నామినేషన్లు
posted on Oct 13, 2025 4:40PM

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ పేరుతో గత ఐదు నెలలుగా ఎస్సీలోని 58 కులాలకు జరుగుతున్న తీవ్ర అన్యాయాన్ని, విద్య, ఉద్యోగ, ప్రమోషన్లలో ఎదురవుతున్న నష్టాన్ని నిరసిస్తూ మాల సంఘాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా చైర్మన్ మందాల భాస్కర్ మాట్లాడుతూ....గత ఐదు నెలలుగా తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు వివిధ పార్టీల అధ్యక్షులకు తమకు జరుగుతున్న అన్యాయంపై వినతి పత్రాలు అందజేసినా స్పందన కరువైందని, మాల సమాజానికి జరుగుతున్న అన్యాయం, రిజర్వేషన్ల వర్గీకరణ వల్ల జరుగుతున్న నష్టంపై సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి తమ ఆకాంక్షను, ఆవేదనను తెలియజేయాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.
ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన- జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో పోటీ
మాల సమాజానికి జరుగుతున్న అన్యాయంపై తమ నిరసనను ప్రజాస్వామ్య పద్ధతిలో తెలియజేయడానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికలలో 300 మంది మాలలు నామినేషన్లు వేయనున్నట్లు ప్రకటించారు. ఐదు నెలలుగా గ్రూప్-3లోని మాల 25 కులాలకు జరుగుతున్న నష్టంపై ఈ పోటీ ఒక నిరసన యుద్ధంగా ఉంటుందని తెలిపారు.