బాబు జమానాలోనే జాబులు.. జగన్ హయాంలో ఓటిమాటలూ.. నీటి మూటలు!

జగన్ ప్రభుత్వ తీరుపై ఏపీలో నిరుద్యోగులు రగిలి పోతున్నారు. పాదయాత్ర సందర్భంగా, ఎన్నికల ప్రచారంలోనూ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యనేదే లేకుండా చేస్తానంటూ ఆర్బాటంగా ప్రచారం చేసి, నమ్మించి నిరుద్యోగుల గొంతు కోశారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏటా జాబ్ క్యాలెండర్ అన్న జగన్ ఈ మూడేళ్లలో ఒక్క క్యాలెండర్ కూడా విడుదల చేయలేదని వారు విమర్శస్తున్నారు.

జాబులు బాబు జమానాలోనే వచ్చాయనీ, జగన్ హయాంలో ఆయన చెప్పినవన్నీ ఓటి మాటలేనని విమర్శించారు. విపక్ష నేతగా ఉన్నప్పుడు అధికారంలోకి వస్తే నిరుద్యోగమన్న మాటే లేకుండా చేస్తామన్న జగన్ అధికారంలోకి వచ్చాకా ఉద్యోగమన్న మాటే వినపడకుండా చేశారనని నిరుద్యోగులు వాపోతున్నారు. మూడేళ్లుగా ఒక్క నోటిఫికేషన్  లేదు. మెగా డీఎస్సీ ఏమైందో తెలియదు. ఏటా జనవరిలో జాబ్‌ కేలండర్‌ హామీ హామీలాగే మిగిలిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ విధానాల కారణంగా రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలి వెళ్లిపోతుండటంతో నిరుద్యోగులకు ప్రైవేటు ఉద్యోగాలు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది.

అదే తెలుగుదేశం హయాంలో అయితే 2014లో డీఎస్సీ వేసి 11 వేల ఉపాధ్యాయపోస్టులు భర్తీ అయ్యాయి, మళ్లీ 2018లో డీఎస్సీ ద్వారా 7900 ఉద్యోగాలను తెలుగుదేశం ప్రభుత్వం భర్తీ చేసింది. అయితే అప్పట్లో విపక్ష నేతగా ఉన్న జగన్ అవీ  ఓ ఉద్యోగాలేనా అంటూ విమర్శించిన జగన్ ఉద్యోగాల భర్తీ అటుంచి వాటి రద్దుపైనే ఎక్కువ దృష్టి పెట్టారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

చంద్రబాబు హయాంలో ప్రైవేటు సెక్టార్ లో ఐదు లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తే, జగన్ హయాంలో ప్రైవేటు సెక్టార్ లో ఉద్యోగాల సంగతి అటుంచి పరిశ్రమలే రాష్ట్రం నుంచి తరలిపోతున్నాయని నిరుద్యోగులు గణాంకాలతో వివరిస్తున్నారు.