డ్రగ్స్ తయారీ కేసులో సంచలన విషయాలు

 

ఒకపక్క స్కూలు.. మరోపక్క మత్తు మందు తయారీ.. స్కూల్ బిజినెస్ లో లాభాలు లేవు అనుకున్న కరస్పాండెంట్..  ఏకంగా మత్తు మందు తయారు చేయడం మొదలుపెట్టాడు.. ఒకవైపు విద్యార్థు లకు పాఠాలు చెబుతూనే ..మరో రూంలో మత్తు పదార్థులు  తయారుచేసి అమ్మేస్తున్నాడు ..అత్యంత ప్రమాదకర మైన ఆల్ఫా జోలం డ్రగ్ ను  తయారు చేసి మార్కెట్లో ఏదేచ్ఛగా విక్రయిస్తున్నాడు.. 

ఏపీ, తెలంగాణ, తమిళనాడు తో పాటు హైదరాబాదు లోని కల్లు కాంపౌండ్లకి ఈ ఆల్ఫా జోలం అమ్మేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.. సికింద్రాబాద్ లోని బోయిన్ పల్లి  పరిధిలో ఉన్న మేధా హై స్కూల్ క్యాంపస్ ల మాదక ద్రవ్యాలు తయారు చేస్తు న్నట్లు అధికారుకు సమాచారం రావడంతో వెంటనే సోదాలు నిర్వహించారు.


 ఈ సోదాల్లో ఆల్ఫా జోలం డ్రగ్  తయారీకి కావల సిన ముడిసరకు లభ్యమయింది ..మరోవైపు దాదాపు 10 కిలోల ఆల్ఫా జోలంను ఈగల్ అధికారులు పట్టుకున్నారు.. ఆల్ఫా జోలం ను బయటికి తీసుకువెళ్లి అమ్మే సమయంలో ఈగల్ టీం దాడి చేసి నలుగురు వ్యక్తులను రెడ్ హ్యాండెడ్ గా  పట్టుకున్నారు. అంతేకాకుండా ఈగల్ టీం స్కూల్ నిర్వాహకుడు జయప్రకాష్ గౌడ్ ను అదుపులోకి తీసుకున్నారు. బోయిన్పల్లి లోని అస్మత్ పేటలో మెగా హై స్కూల్ ని జయప్రకాష్ గౌడ్ నడుస్తున్నాడు. ఈ స్కూల్లో ఉదయం సమయంలో విద్యార్థులకు క్లాసులు... సాయంత్రం ట్యూషన్ లు జరుగుతూనే ఉన్నాయి. 

అంతేకాకుండా దేవాలయం లాంటి ఈ స్కూల్లో గుట్టు చప్పుడు కాకుండా రెండవ అంతస్తులో ఏకంగా మత్తు మందు తయారీ ఫ్యాక్టరీ పెట్టాడు.. మాదక ద్రవ్యాలు తయారు చేయా లంటే కనీసం ఆరు రోజుల సమయం పడుతుంది. ఇందుకు సంబం ధించి  .6 రియాక్టర్ల ఏర్పాటుచేసి డ్రగ్ను తయారు చేస్తు న్నాడు.. ప్రతి నెలకు దాదాపు 20 నుంచి 30 కిలోల ఆల్ఫా జోలం తయారుచేసి కల్లు కాంపౌండ్లకి సరఫరా చేస్తున్నా రని ఈగల్ టీం ప్రతినిధులు చెప్పారు.. 

స్కూల్లో విద్యార్థులకు పాఠాలు చెప్పేదాని కంటే  అమ్మకాల ద్వారే పెద్ద ఎత్తున డబ్బులు వస్తున్నాయని జయప్రకాష్ గౌడ్ అధికారులకు తెలిపాడు.. స్కూల్లోని ఈ చిన్నపాటి కంపెనీలో సోదాలు చేసినప్పుడు మొత్తం కలిపి పది కిలోల ఆల్ఫా జోలం డ్రగ్‌ను స్వాధీన పరుచుకున్నారు.. దీనికి తోడు పెద్ద ఎత్తున రా మెటీరియల్ కూడా స్వాధీనం చేసుకున్నారు.. ఈ డ్రగ్ మొత్తాన్ని కూడా వివిధ ప్రాంతాల్లో ఉన్న బ్రోకర్స్ కి సరఫరా చేస్తున్నట్లు తెలిపారు..


సికింద్రాబాద్ బోయినపల్లి పరిధిలో ఉన్న మేధా హై స్కూల్ లో ఈగిల్ స్వాధీనం చేసు కున్న ఆల్ప్రా జోలామ్ తయారీ యూనిట్‌పై ప్రాథమిక నివేదిక ఇచ్చింది.మహబూబ్‌నగర్ కు చెందిన మలేలా జయప్రకాశ్ గౌడ్ బోవెనపల్లి, హైదరాబాద్‌లోని మెధా స్కూల్ నిర్వహిస్తున్నాడు.

కానీ స్కూల్ పెట్టి నష్టపోయాడు. అయితే జయప్ర కాష్ గౌడ్ కి దాదాపు సంవత్సరం క్రితం శేఖర్‌ ద్వారా గురువారెడ్డి అనే వ్యక్తిని కలిశాడు. డబ్బు దాహంతో, గురువారెడ్డి అతనికి ఆల్ప్రాజోలామ్ తయారీ విధానం మరియు ఫార్ము లాను అందించాడు.

దీంతో జయప్రకాశ్ స్కూల్ ప్రాంగణం వెనుకభాగంలో ఆల్ప్రాజోలామ్ తయారీ యూనిట్‌ ను ఏర్పాటు చేశాడు. అనంతరం, బూత్‌పూర్, మహబూబ్‌నగర్ జిల్లా బూత్ పూర్ పరిసర గ్రామాల లోని తాటి కల్లు లకు ఆల్ప్రాజో లామ్ సరఫరా చేయడం ప్రారంభించాడు.విశ్వసనీయమైన సమాచారం రావడంతో ఈగిల్ టీమ్ దాడి నిర్వహించి, నిందితుడితో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసి... వారి వద్ద నుండి 3.5 కేజీల ఆల్ప్రాజోలామ్. 4.3 కేజీల అర్థసిద్ధమైన ఆల్ప్రాజోలామ్,రూ. 21 లక్షల నగదు తో పాటు భారీ స్థాయిలో ముడి సరుకు స్వాధీనం చేసుకున్నారు.డ్రగ్స్ రాకెట్ లో మిగిలిన నిందితుల వ్యవహారంపై ఈగల్ టీం దర్యాప్తు కొనసాగించారు..

Online Jyotish
Tone Academy
KidsOne Telugu