జాస్మిన్‌.. కేన్స‌ర్‌నే పొమ్మంది!

మ‌న‌సుకు హాయిక‌లిగిస్తాయి మ‌ల్లెలు. మ‌ల్లెలు కురిసిన చ‌ల్ల‌నివేళ‌లో.. అంటూ సినీక‌వులు బ‌హు చ‌క్క‌ని పాట‌తో సినీప్రేక్ష‌కుల‌ను అమాంతం ఆక‌ట్టుకున్నారు. అదో అందం, అదో మాయ‌! మ‌ల్లెను ఆంగ్లంలో జాస్మిన్ అంటారు..ఈ జాస్మిన్ మ‌ర‌ణాన్నే కాదు పొమ్మంది! 

మ‌న‌వాళ్ల‌కే కాదు, ఎవ‌రిక‌యినా కేన్స‌ర్ అంటేనే భ‌యం. ఏదో తెలీని బాధ‌. అయ్యో పాపం అనిపిస్తుంది. మాంఛెస్ట‌ర్‌లో నివ‌సిస్తున్న ఈ డేవిడ్ జాస్మిన్ వ‌య‌సు ఇపుడు 51 సంవ‌త్స‌రాలు. ఆమెకు బ్రెస్ట్ కేన్స‌ర్ అని  మూడేళ్ల క్రితం తేల్చారు. అంతే.. కుటుంబం, స్నేహితులు.. యావ‌త్ మాంఛెస్ట‌ర్ మ‌న‌సులో తెగ బాధ ప‌డింది.  మంచి బంధువుని, మంచి స్నేహితురాలినీ త్వ‌ర‌లో కోల్పోతున్నామ‌ని. యు.కె ఆస్ప‌త్రిలో చికిత్స చేసిన డాక్ట‌ర్లు ఇక ఆమె జీవితం రెండు మాసాలే అని తేల్చారు. ఆమె కోసం అంతా  బావురుమ‌న్నా రు. ప‌రీక్ష‌లు చేసిన డాక్ట‌ర్లు ఆ సంగ‌తి చెప్ప‌డానికి చాలా సంశ‌యించారు. కానీ చెప్ప‌క త‌ప్ప‌లేదు. ఆమె కోసం ఆస్ప‌త్రి చుట్టూ తిరిగిన‌వారు బాధ‌ప‌డ‌ని క్ష‌ణం లేదు. అయ్యో ఇన్నాళ్ల స్నేహం ఇంక రెండు నెల‌ల్లో ముగిసిపోతుందా? మ‌ర‌ణానికి క‌రుణ లేదు సుమా అనుకున్నారంతా. 

కానీ విచిత్రాలు లోకంలో సంభ‌విస్తుంటాయి. చాలామంది న‌మ్మ‌రు. కొన్ని సంఘ‌ట‌న‌లు వారినీ న‌మ్మిస్తు న్నాయి. ఇదుగో జాస్మిన్ కేసు లా.  మాంఛెస్ట‌ర్‌లోని జాతీయ ఆరోగ్య సేవా సంస్థ ఆస్ప‌త్రివారు జాస్మిన్‌ను మ‌ళ్లీ మ‌ళ్లీ ప‌రీక్షించారు. ఎలాగైనా ఆమె చ‌క్క‌గా న‌వ్వుతూండాల‌ని కోరుకున్నారు. ఆ ప్రార్ధ‌న ఎవ‌రో విన్నా రు. అంతే వారి ప్ర‌య‌త్నాలు ఫ‌లించాయి. జాస్మిన్‌కు బ్రెస్ట్ కాన్స‌ర్ ల‌క్ష‌ణాలేవీ లేవ‌ని తేల్చారు.  

ఒక్క‌సారిగా దిగులు గుహ‌లోంచి ఆనంద‌పు వెలుగు క‌న‌ప‌డింది. జాస్మిన్ చిరున‌వ్వింది. మాంఛెస్ట‌ర్ ప్ర‌జ‌లు ఆనందంతో కేరింత‌లు కొడుతున్నారు. ఆమె సెస్టెంబ‌ర్‌లో త‌న 25వ వివాహ వార్షికోత్స‌వం బ్ర‌హ్మాండంగా జ‌రుపుకోవాల‌ని ఎదురుచూస్తోంది.