14,000 ఎలుగుబంట్ల వేట: జపాన్‌లో అసలేం జరుగుతోంది?
Published on: Thu Aug 27, 2026 10:35AM

జపాన్‌ను ఇప్పుడు ఒక ఊహించని విపత్తు తీవ్రంగా కలవరపెడుతోంది. ఇప్పటివరకు ప్రశాంతంగా ఉండే జపనీస్ గ్రామాలు, నగర శివార్లు ఇప్పుడు భయానక వాతావరణంలో అల్లల్లాడిపోతున్నాయి. అడవులకే పరిమితం కావాల్సిన ఎలుగుబంట్లు ఉన్నట్లుండి జనావాసాల్లోకి విరుచుకుపడుతుండడమే దీనికి ప్రధాన కారణం. గత ఏడాదితో పోలిస్తే ఎలుగుబంట్ల దాడులు తీవ్రరూపం దాల్చాయి. దేశవ్యాప్తంగా వీటి దాడిలో 230 మందికి పైగా ప్రజలు తీవ్రంగా గాయపడగా, ఏకంగా 13 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. జపాన్ చరిత్రలోనే అత్యంత ఘోరమైన మరియు అత్యధిక మరణాలు నమోదైన ఏడాడిగా ఇది రికార్డులకెక్కింది. భయాందోళనలో ఉన్న పౌరులను కాపాడుకోవడానికి ప్రభుత్వం అనూహ్యమైన మరియు వివాదాస్పదమైన నిర్ణయం తీసుకుంది. కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే 14,000కు పైగా ఎలుగుబంట్లను చంపేసింది. ఇది కేవలం ఒక వేట వార్త మాత్రమే కాదు, ప్రకృతి సమతుల్యత దెబ్బతింటే మానవ మనుగడ ఎలాంటి తీవ్ర ప్రమాదంలో పడుతుందో హెచ్చరించే ఒక భయానక సాక్ష్యం. ఈ ప్రాణాంతక సంక్షోభానికి ప్రధానంగా వాతావరణ మార్పులు మరియు తీవ్రమైన వేడిగాలులే మూలకారణమని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. అకితా, ఇవాటే వంటి పర్వత ప్రాంతాలలో నమోదైన రికార్డు స్థాయి ఉష్ణోగ్రతల వల్ల ఎలుగుబంట్లు శీతాకాల నిద్రకు సిద్ధమయ్యే క్రమంలో తినే బీచ్ నట్స్, పిక్కలు రూపుమాసిపోయాయి. ఆహారం దొరక్క ఆకలితో అలమటించిన ఎలుగుబంట్లు వేరే దారి లేక పల్లెలు, పట్టణాల వైపు అడుగులు వేశాయి. దీనికితోడు జపాన్ గ్రామీణ ప్రాంతాల్లో జనాభా వేగంగా తగ్గిపోవడం, తోటలు మరియు పొలాలు నిర్మానుష్యంగా మారడం ఎలుగుబంట్లకు అనుకూలంగా మారింది. ఇళ్లలోకి చొరబడడం, సూపర్ మార్కెట్లలో భయానక వాతావరణం సృష్టించడం మరియు స్కూళ్ల సమీపంలో తిరగడం వంటి సంఘటనలు దేశవ్యాప్తంగా వెలుగు చూశాయి. పరిస్థితి ఎంతగా క్షీణించిందంటే, లండన్ వంటి విదేశీ ప్రభుత్వాలు కూడా జపాన్ పర్యటనకు వెళ్లే తమ పౌరులకు 'బేర్ అలర్ట్' హెచ్చరికలు జారీ చేశాయి. ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రత్యేకంగా ఎలుగుబంట్ల నష్టపరిహార బీమాలను ప్రారంభించాయి. రైతులు ఎర్రటి కళ్లు వెలిగే రోబోటిక్ తోడేళ్లను పొలాల్లో అమర్చగా, కొన్ని కంపెనీలు ఎలుగుబంట్ల దాడుల నుండి తప్పుకోవడానికి ప్రైవేట్ షెల్టర్లను కూడా విక్రయించడం ప్రారంభించాయి.
japan bear menace 13 killed,japan culled 14000 asiatic bears.


