మూడేళ్ళ జగన్ పాలన ఎలా ఉందంటే ..

ఆంధ్ర ప్రదేశ్’ ప్రభుత్వం  మరో మూడు రోజుల్లో మూడేళ్ళు పూర్తి చేసుకుంటోంది. 2019 మే 30 తేదీన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఎన్నికల ప్రచారంలో ఒక్క ఛాన్స్ అని వేడుకున్న జగన్ రెడ్డి, ప్రమాణ స్వీకారం వేదిక నుంచే, ఆరు నెలల్లో అద్భుతాలు సృష్టిస్తానని, బ్రహ్మాండం బద్దలు చేస్తాని ప్రజలకు వాగ్దానం చేశారు. వరస పెట్టి  హామీలు గుప్పించారు. కానీ, ఆరు నెలలు మూడేళ్ళు అయినా, పరిస్థితిలో మార్పులేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగు పడలేదు సరికదా, మరింతగా దిగజారి పోయింది. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకు పోయింది. సంవత్సరానికి 365 రోజులు అయితే, అందులో 300 రోజులు ఓడీ మీదనే ప్రభుత్వం బతికేస్తోంది. ఇక అప్పులు కూడా పుట్టని దివాలా దశకు చేరుకుంది.  

అయితే, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మూడేళ్ళ సుందర ముదనష్ట పాలనలో మట్టి కొట్టుకుపోయింది ఒక్క ఆర్థిక రంగమేనా, ఒక్క ఆర్థిక వ్యవస్థ మాత్రమేనా, మిగిలిన వ్యవస్థలన్నీ బాగున్నాయా? అంటే లేదు, ఏ రంగానికి ఆ రంగం, ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థ దినదిన ప్రవర్తమానంగా దిగజారి ఆఖరి మెట్టుకు చేరుకుంది. శాంతి భద్రతల పరిస్థితి కలల్ముందే కనిపిస్తోంది. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన పెట్టుబడులను ఆకర్షించేందుకు, రాష్ట్రంలో శాంతి భద్రతలు కీలకం. కానీ, జగన్ రెడ్డి అధికారంలోకి వస్తూనే, అరాచక పాలనకు అక్కడి నుండే, శ్రీకారం చుట్టారు. వస్తువస్తూనే, ప్రజా వేదికను కూల్చి వేశారు. రాజకీయ కక్ష సాధింపుకు అంకు రార్పణ చేశారు.ఆ విధ్వంసకాండ  ఈరోజుకు కూడా ఆలా కొనసాగుతూనే వుంది. 
తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఆర్థిక పరిపుష్టికి పునాదిగా నిల్చే విధంగా, అమరావతి అభివృద్ధికి శ్రీకారం చుడితే, జగన్ రెడ్డి అధికారంలోకి వస్తూనే రాష్ట ప్రజల సంపద అమరావతిని నిర్వీర్యం చేశారు. అధికార వికేంద్రీకరణ ముసుగులో. మూడు రాజధానుల పేరుతొ, సర్కార్ రియల్ దందా తెరమీదకు తెచ్చారు.

ఆ ప్రహసనం ఇంకా ఈరోజుకు అలా సాగుతూనే వుంది. అందుకే, రాష్ట్రం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు పూర్తయినా, రాజధాని లేని అనాధగానే, రాష్ట్రం మిగిలి పోయింది. రివర్స్ టెండర్ల పేరుతో అభివృద్ధి చుక్క పెట్టేశారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అభివృద్ధికి హాలిడే ప్రకటించారు. పోలవరం సహా తెలుగు దేశం ప్రభుత్వం మొదలు పెట్టిన ప్రాజెక్టుల నిర్మాణం నిలిచిపోయింది. ఇలా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకుకు పునాదులుగా నిలిచే అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యంచేశారు. పెట్టుబడులు అడ్డుకట్ట వేశారు. రాకుండా చేశారు. అందుకే, దావో స్ వెళ్ళినా, ఫలితం లేకుండా పోయింది. సింగడు అద్దింకి పోనూ పోయాడు, రాను వచ్చాడు అన్నట్లుగానే దావోస్ యాత్ర ముగుస్తుందని, అధికార వర్గాల సమాచారం.  

మరోవంక,ఈ రోజు పచ్చని కోనసీమలో వైసేపీ ప్రభుత్వం పెట్టిన రాజకీయ, కుల చిచ్చు దావానంలా వ్యాపిస్తోంది. సర్కార్ రగిల్చిన మంటలు కోనసీమ సరిహద్దులు విస్తరిస్తున్నాయి. అయినా, అక్కడ ఒక్కచోట మాత్రమే కాదు, రాష్ట్రం అంతటా  ఒకే విధమైన అరాచక పాలన రాజ్యమేలుతోంది. ఒక అదికార పార్టీ ఎమ్మెల్సీ తమ కారు డ్రైవర్’ హత్య చేసి శవాన్ని స్వయంగా ఇంటికి చేరుస్తారు, ఒక మంత్రి ఇంటిని, సొంతింటి (వైసీపీ) దుండగులు తగులపెట్టి సర్కార్’కే సవాలు విసురుతారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిస్థితి ఎంత అద్వాన్న స్థితిలో వుందో చెప్పేందుకు వేరే ఉదాహరణలు అవసరం లేదు. 
ఇవ్వన్నీ ఒకెత్తు అయితే,వైసీపీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే నవరత్నాలు కూడా నవ్వుల పాలవుతున్నాయి.

నిజానికి, ముఖ్యమత్రి జగన్ రెడ్డి ప్రభుత్వ్వం, ఓటు బ్యాంకు సృష్టించుకునే దురాలోచనతో  సంక్షేమ పథకాలకు ఇవ్వవలసిన ప్రాధాన్యత కంటే, ఎక్కువ ప్రధాన్యాతే ఇచ్చింది. అభివృద్ధిని అటకెక్కించి, అప్పులు చేసి మరీ, సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసింది. అయినా, చివరకు అప్పులే మిగిలాయి కానీ, ప్రజలకు ఇచ్చిన  హామీలు అరకొరగానే అమలయ్యాయి. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం వివిధ  సంక్షేమ పథకాల కింద కుటుంబానికి, ఏడాదికి రూ. మూడు నుంచి ఐదు లక్షలు ప్రయోజనం చేకూరుస్తామని ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసింది. కాగా, తాజాగా గడచిన మూడేళ్ల కాలంలో రూ.1.40 లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లో జమ చేసినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. అంటే రాష్ట్ర జనాబా ఐదు కోట్లని అనుకుంటే, ఒక్కొకరికి వచ్చేది రూ.7000,  నలుగురు ఉన్న కుటుంబానికి ఏడాదికి రూ.28 వేల నగదు ప్రభుత్వం ద్వారా అందిందని ప్రభుత్వం చెబుతోంది.

అంటే జగన్ రెడ్డి  ప్రభుత్వం ఇచ్చిన హామీకి వాస్తవంలో ఇచ్చిన మొత్తానికి ఎక్కడా పొంతన లేదు. వాగ్దానం చేసింది, సంవత్సరానికి మూడు  నుంచి నాలుగు లక్షల రూపాయలు, అయితే విదిలిచింది మాత్రం ఏడాదికి రూ.27 వేలు. అంటే మూడేళ్ళకు కలిపినా లక్ష లోపలే ఉంది. మరో వంక తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో అమలైన, అన్న క్యాంటీనలు మొదలు విదేశీ విద్యాపథకం వరకూ అనేక పథకాలను జగన్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసింది.

ఇంకొన్ని పథకాలకు అర్హతలను సవరించి, భారాన్ని తగ్గించుకుంది. అందుకే, జగన్ రెడ్డి మూడేళ్ళ పాలనను నిజాయతీగా విశ్లేషిస్తే... ఎవరికైనా నిరాశే మిగులుతుందని, ఎవరో కాదు, వైసేపీ అభిమానులే ఆవేదన వ్యక్త పరుస్తున్నారు. మరోవంక ఈ పాలనా ఇలాగే, కొనసాగితే, ఆంధ్ర ప్రదేశ్ అర్తికంగానే కాదు అన్ని విధాల ఆకహ్రి స్థానానికి చేరుకుంటుందని , ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.