జగన్ అప్పుల వివరాలన్నీ బహ్మ రహస్యం.. అడగడానికి లేదు.. అడిగినా చెప్పరు?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులు ఎందుకు చేస్తోంది, ఎక్కడెక్కడ నుంచి చేస్తోంది. ఆ తీసుకున్న అప్పులను ఎలా ఖర్చు పెడుతోంది? ఈ వివరాలన్నీ బ్రహ్మ రహస్యం. కాదా కాదు జగన్ రహస్యం. ఎవరికీ తెలియదు,

ఎవరైనా అడిగినా సర్కార్ చెప్పదు. ఆఖరికి కాగ్ అయినా సరే.. మరో రాజ్యాంగ వ్యవస్థ అయినా సరే. ఎవరడినిగా చెప్పం. మా అప్పులు, మా ఇష్టం అన్నట్లుగా ఏపీ సర్కార్ వ్యవహరిస్తోంది. రాజ్యంగ బద్ధంగా మేం నడుచుకోవడం కాదు.. మేం నడుపుతున్నదే రాజ్యాంగం. మేం చేసేదే పద్ధతి. ఎవరైనా సరే అంగీకరించి తీరాల్సిందే. ఇదీ జగన్ సర్కార్ వ్యవహారవైలి. లేకపోతే ఆర్థిక సంవత్సరం ఆరంభమై ఇన్ని నెలలు గడిచినా ఏపీ ప్రభుత్వ ఆదాయ,వ్యయ వివరాలేవీ ఎవరికీ తెలియదు.

ఏపీ సర్కార్ కు సంబంధించి ఏప్రిల్ నెల ఆదాయ,వ్యయాల వివరాలను మాత్రమే కాగ్ ఆన్ లైన్ లో పెట్టింది. మిగిలిన మూడు నెలలకు సంబంధించి అతీగతీ లేదు.  దీనిపై కాగ్ ను అడుగుతుంటే ఏపీ నుంచి తాము అడిగిన వివరాలేవీ రావడం లేదని చెబుతోంది. అయితే ఈ విషయంలో ఏపీ కంటే తెలంగాణ ప్రభుత్వం మెరుగైన స్థితిలో ఉంది. జూన్ నెల వరకూ లెక్కలన్నింటినీ క్లీయర్ చేసి కాగ్ కు   అందించింది. కేవలం జూలై మాత్రమే పెండింగ్ లో ఉంది. ఏపీ సర్కారు మాత్రం మేమిచ్చినవే వివరాలు, మేం ఇచ్చినప్పుడే ఇస్తాం అన్నట్లు వ్యవహరిస్తున్నది.  

ఈ నేపథ్యంలో కాగ్ ఆదాయ వ్యయ వివరాలను అందించాలని ఏపీ సర్కారును మరోసారి కోరింది. ఆర్థిక సంవత్సరం ప్రారంభమై ఐదు నెలలు గడుస్తున్నా తొలి నెల లెక్కలు ఇంతవరకూ అందించకపోవడం ఏమిటని ప్రశ్నించింది. దీంతో ఏపీ సర్కారులో కలవరం మొదలైతే.. కాగ్ ఏపీ సర్కార్ ను నిలదీయడం విపక్షాలకు విమర్శనాస్త్రం అందినట్లు అయ్యింది.

వాస్తవానికి గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కూడా కాగ్ కు సక్రమంగా వివరాలు అందించలేదు. దీంతో తరచూ కాగ్ కార్యాలయం నుంచి రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యాయాలనికి లేఖలు రాయడంతో పాటు సంప్రదింపులు జరుపుతున్నారు. కానీ ఏపీ అధికారులు మాత్రం సరిగా స్పందించలేకపోతున్నారు. ప్రధానంగా రుణాలు, ష్యూరిటీల విషయంలో నెలకొన్న సందిగ్ధమే జాప్యానికి కారణమని రాష్ట్ర ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా వ్యవహరిస్తే కాగ్ అగ్గి మీద గుగ్గిలమవుతుంది. కానీ ఏపీ విషయంలో మెతక వైఖరి అవలంబిస్తోంది.  రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినా కేంద్రం తగురీతిలో స్పందించకపోవడాన్ని పరిశీలకులు సైతం ప్రశ్నిస్తున్నారు.