జగన్ దీపావళి వేడుకల వెనుక అసలు రహస్యం ఇదేనా?

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఏడాది దిపావళి సంబరాలలో పాల్గొన్నారు. దీపావళి సందర్భంగా బాణ సంచా కాల్చి సందడి చేశారు. సతీసమేతంగా ఆయన దీపావళి సంబరాలు చేసుకుని బాణసంచా కాల్చడం ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్ తన లండన్ పర్యటన ముగించుకుని వచ్చిన తరువాత బెంగళూరులోని తన యహలంక ప్యాలెస్ లో సతీమణి భారతితో కలిసి దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్  అయ్యాయి. ఎందుకంటే జగన్ బహిరంగంగా దీపావళి సంబరాల్లో పాల్గొన్న సందర్భం గతంలో ఎన్నడూ లేదు. కాగా జగన్ దీపావళి పండుగను జరుపుకున్న విషయాన్ని వైసీపీ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ లో కూడా షేర్ చేశారు. 

గతంలో ఎన్నడూ ఇలా ఒక హిందూ పండుగను జగన్ దంపతులు జరుపుకున్న సందర్భం లేదు. అసలాయన హిందూ పండుగలు జరుపుకోవడానికి పెద్దగా ఇష్టపడరన్న ప్రచారం ఉంది. దేవాళయాలకు వెళ్లినా అక్కడ తీర్థం, ప్రసాదం వంటివి స్వీకరించడానికి జగన్, ఆయన కుటుంబం విముఖత చూపుతారన్న ప్రచారం కూడా ఉంది. అటువంటిది గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయన సతీసమేతంగా దీపావళి వేడుక జరుపుకోవడం తనపై ఉన్న హిందూ వ్యతిరేక ముద్రను చెరిపివేసుకోవడానికేనని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu