ఆయనకు మూడు కళ్ళట
posted on Oct 1, 2013 12:20PM
.jpg)
చంద్రబాబు తనకి ఆంద్రా,తెలంగాణా ప్రాంతాలు రెండు కళ్ళవంటివని చెపితే, ఆయనకంటే తనకి మరో కన్నుఎక్కువుందని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలు తనకు మూడు కళ్ళవంటివని అన్నారు. అయితే ప్రస్తుతం ఆయన పార్టీ ముందు సీమంద్రాలో తన రెండు కళ్ళను కాపాడుకొనే ప్రయత్నంలో ఉందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ ప్రయత్నంలోనే ఆయన తన మూడో కన్నుతెరిచి హైదరాబాదులో సమైక్య శంఖారవం పూరించబోతున్నారు. తెలంగాణ ఏర్పాటయితే కుప్పం నుండి శ్రీకాకుళం వరకు నీటి సమస్యలు వస్తాయని చెపుతూనే, తనకు పట్టం కడితే తెలంగాణా ప్రజల కోసం ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టులను పూర్తిచేస్తానని వాగ్ధానం చేసారు. తెలంగాణా ఏర్పాటుని వ్యతిరేకిస్తూ హైదరాబాదులో సభ పెట్టబోతూ, అక్కడి ప్రజలు తనకు ఓటేసి గెలిపిస్తే వారందరినీ అభివృద్ధి పథం వైపు నడిపిస్తానని వాగ్దానం చేసారు. మరి తెలంగాణా ప్రజలు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.