ధాంక్యూ సీబీఎన్ ఫర్ ఐఎస్బీ హ్యాష్ ట్యాగ్ తో ట్విట్లర్లో ప్రశంసలు

హైదరాబాద్‌లోని ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ 20వ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు గురువారం మ‌ధ్యాహ్నం చేసిన ట్వీట్ల‌పై   ప్ర‌శంసల వర్షం కురుస్తోంది.   ఐఎస్‌బీని ఎక్క‌డ నెల‌కొల్పాలన్న విష‌యంపై స‌మాలోచ‌న‌లు చేస్తున్న ఆ సంస్థ డైరెక్ట‌ర్ల బోర్డును తాను హైద‌రాబాద్‌లోనే ఆ సంస్థ‌ను ఏర్పాటు చేసేలా ఒప్పించిన తీరుపై చంద్ర‌బాబు గురువారం వరుస ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే.

ఆ ట్వీట్లలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బి)ని హైదరాబాద్ లో ఏర్పాటు చేసే విధంగా ఆ సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను ఒప్పించేందుకు తానేం చేశానో చంద్రబాబు ఆ ట్వీట్లలో సవివరంగా చెప్పుకోచ్చారు. అప్పటికే హైదరాబాద్ కంటే ఎంతో అభివృద్ధి చెందిన బెంగళూరు, చెన్నై, ముంబైలలో ఏదో ఒక నగరంలో ఐఎస్ బీ ఏర్పాటు చేయాలని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఒక నిర్ణయానికి వచ్చేశారనీ, ఇక ప్రకటనే తరువాయి అని అంతా భావిస్తున్న సమయంలో తాను హైదరాబాద్ లో ఐఎస్ బీ ఏర్పాటుకు ప్రతిపాదించాననీ, ముఖ్యమంత్రి హోదాను మరచి ఐఎస్ బి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల ను స్వయంగా కలిసి వారిని తన ఇంటికి ఆహ్వానించాననీ, వారికి స్వయంగా సర్వ్ చేశాననీ ఆ ట్వీట్ల లో చెప్పుకొచ్చారు.

హైదరాబాద్ లో ఐఎస్ బీ ఏర్పాటు చేస్తే ఇచ్చే రాయతీలు, కల్పించే సౌకర్యాలు వంటి అంశాలపై వారికి తన నివాసంలోనే పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చాననీ చంద్రబాబు పేర్కొన్నారు. ఐఎస్ బీ హైదరాబాద్ లో ఏర్పాటైతే.. హైదరాబాద్ రూపు రేకలే మారిపోతాయనీ తాను అప్పుడే ఊహించాననీ పేర్కొన్నారు.

ఇప్పుడు ఐఎస్ బీ ప్రపంచంలోనే మేటి విద్యా సంస్థగా హైదరాబాద్ కే కాకుండా దేశానికే గర్వకారణమైన సంస్థగా ఎదిగి నిలవడం గర్వంగా ఉంనీ చంద్రబాబు ట్వీట్లలో పేర్కొన్నారు. చంద్రబాబు ట్వీట్లపై ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు, విద్యావేత్తలు, దిగ్గజ వ్యాపార సంస్థల అధినేతలూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ధ్యాంక్యే సీబీఎన్ ఫర్ ఐఎస్ బీ పేరిట హ్యాష్ ట్యాగ్ పెట్టి మరీ పొగడ్తలలో ముంచెత్తుతున్నారు. కేవలం చంద్ర‌బాబు కార‌ణంగానే త‌మ ప్రాంతానికి రావాల్సిన ఐఎస్‌బీ హైద‌రాబాద్‌కు వెళ్లిపోయింద‌ని ముంబై, బెంగ‌ళూరుకు చెందిన ప్రముఖులు ట్వీట్లు చేశారు.