పీకే స్కెచ్‌తోనే టీడీపీ ఆఫీసుల‌పై దాడులు?.. ఆయ‌న‌ చాలా డేంజ‌ర్ గురూ!

ఏపీ వ్యాప్తంగా టీడీపీ కార్యాల‌యాల‌పై ఏక‌కాలంలో వైసీపీ శ్రేణులు దాడుల‌కు తెగ‌బ‌డ్డాయి. మంగ‌ళ‌గిరిలోని టీడీపీ సెంట్ర‌ల్ ఆఫీసుపైనైతే అచ్చం సినీ ఫ‌క్కీలో అటాక్ జ‌రిగింది. అదేదో ఫ్యాక్ష‌న్ సినిమా సీన్ మాదిరి.. రౌడీ మూక‌లు వ‌రుసగా వాహ‌నాలు వేసుకొని.. వాటిపై వేలాడుతూ వ‌చ్చి.. క‌ర్ర‌లు, రాడ్లు, సుత్తిల‌తో దాడి చేశారు. వాహ‌నంతో గేటును ఢీ కొట్ట‌డం అయితే ముందుగానే రిహార్స‌ల్స్ చేసొచ్చిన‌ట్టుగా ప‌క్కాగా గుద్దేశారు. క‌ట్ చేస్తే.. ఇటు మంగ‌ళ‌గిరి టీడీపీ ఆఫీసు ధ్వంసం చేయ‌గానే.. ఎవ‌రో ఫోన్ చేసి ఉస్కోమ‌న్న‌ట్టు.. ప‌క్కాగా ఇంచుమించు అదే స‌మ‌యానికి ఏపీవ్యాప్తంగా వివిధ జిల్లాల్లోని కార్యాల‌యాల‌పైనా వైసీపీ శ్రేణులు బీభ‌త్సం సృష్టించారు. ఇక‌, వీట‌న్నిటికంటే ముందు విజ‌య‌వాడ‌లో టీడీపీ నేత ప‌ట్టాభి ఇంటిపై దాడితో ఈ గొలుసుక‌ట్టు దాడుల‌కు నాంది ప‌డింది.

ఇలా ప‌ట్టాభి జ‌గ‌న్‌ను ఉద్దేశించి బోసిడీకే అన‌గానే.. అలా వైసీపీ వాళ్లంతా స‌డెన్‌గా రెచ్చిపోవ‌డం మాత్రం కాక‌తాళీయంగానో, యాధృచ్చికంగానో జ‌రిగింది కానే కాదంటున్నారు. ఇదంతా ప‌క్కా వ్యూహం ప్ర‌కార‌మే జ‌రిగింద‌ని గ‌ట్టిగా న‌మ్ముతున్నారు. మ‌రి, ఆ ప‌క్కా వ్యూహం ర‌చించిందెవ‌ర‌నేదే ఇక్క‌డ ఇంట్రెస్టింగ్ పాయింట్‌. 

సీఎం జ‌గ‌న్ పాల‌నా వ్య‌వ‌హారాల‌తో నిత్యం బిజీగా ఉంటారు. సో, అమ‌లు ఆయ‌న ఆదేశాల‌తోనే జ‌రిగింద‌ని అంటున్నా.. వ్యూహం మాత్రం జ‌గ‌న్‌ది కావ‌చ్చు, కాక‌పోవచ్చు. ఇక‌, సీఎంను అంటిపెట్టుకునే ఉండే స‌జ్జ‌ల ప్లాన్‌ చేశారా? అంటే ఆయ‌న‌కు అంత సీన్ లేదంటున్నారు. మ‌రి, ఈ క్రిమిన‌ల్ మైండ్ విజ‌య‌సాయిరెడ్డిదా అంటే.. ఆయ‌న‌కు జ‌గ‌న్‌తో గ్యాప్ పెర‌గ‌డం వ‌ల్ల విజ‌య‌సాయి కూడా కాదంటున్నారు. ఇక మ‌రింత లోతుగా విశ్లేషిస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యాల‌యాల‌పై ఏక‌కాలంలో మూక దాడుల వ్యూహ‌క‌ర్త‌, సూత్ర‌ధారి.. ప్ర‌శాంత్ కిశోర్ కావొచ్చ‌ని భావిస్తున్నారు. ఆ మేర‌కు ఉన్న‌త స్థాయి రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. 

ఇటీవ‌లే ప్ర‌శాంత్ కిశోర్‌తో జ‌గ‌న్ పార్టీ డీల్ కుదుర్చుకున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే పీకే టీమ్ విశాఖ‌లో రంగంలోకి దిగింద‌ని టాక్‌. పీకే బృందం వ‌చ్చిరాగానే ప‌ని మొద‌లుపెట్టేసింద‌ని అంటున్నారు. డ్ర‌గ్స్‌, గంజాయి ఎపిసోడ్ ఏపీలో హాట్ హాట్‌గా సాగుతుండ‌టంతో పాటు.. అప్పులు, జీతాలు ఆల‌స్యం, ప‌థ‌కాల కోత‌, ప‌న్నుల‌ బాదుడు.. ఇలా జ‌గ‌న్ ఇమేజ్ ప్ర‌జ‌ల్లో బాగా డ్యామేజ్ జ‌రిగింద‌ని గుర్తించ‌డంతో.. ప‌బ్లిక్‌ను ఈ విష‌యాల నుంచి డైవ‌ర్ట్ చేసేందుకు అద‌ను కోసం ఎదురుచూస్తున్న పీకే టీమ్‌.. ప‌ట్టాభి ప్రెస్‌మీట్‌ను త‌మ‌కు అనుకూలంగా, అవ‌కాశంగా మార్చుకున్నార‌ని చెబుతున్నారు. అందుకే, ప‌ట్టాభి మీడియాతో మాట్లాడారో లేదో.. వెంట‌నే దాడుల వ్యూహాన్ని జ‌గ‌న్‌కు చెప్ప‌డం.. ఆయ‌న ఓకే అన‌డం.. ఆ వెంట‌నే దేవినేని అవినాశ్‌ మ‌నుషుల‌తో అటాక్స్ చేయించ‌డం.. అంతా గంట‌ల వ్య‌వ‌ధిలో చ‌క‌చ‌కా జ‌రిపించేశార‌ని అంటున్నారు. పీకే టీమ్ వేసిన స్కెచ్ కాబ‌ట్టే.. ఇంత ప‌క్కాగా వ‌ర్క‌వుట్ చేశార‌ని చెబుతున్నారు. 

ఇక, ప్ర‌శాంత్ కిశోర్ ఇలాంటి దాడుల‌ను ఎంక‌రేజ్ చేస్తారా అనే డౌట్ అస్స‌లు రాన‌వ‌స‌రం లేదంటున్నారు విశ్లేష‌కులు. ఎందుకంటే.. బెంగాల్‌లో మ‌మ‌త‌కు పొలిటిక‌ల్ అడ్వైజ‌ర్‌గా ఉన్న పీకే వ్యూహాల‌న్నీ దాడులు, విధ్వంసం చుట్టూనే తిరిగాయి. హింస ఆయ‌న అమ్ముల‌పొదిలోని ప‌దునైన వ్యూహం అంటారు. అంతేకాదు, ఇటీవ‌ల యూపీలో లఖింపూర్ ఖేరీ రైతుల మార‌ణ‌కాండ‌ స్కెచ్ కూడా ఆయనదే అనే మాట కూడా అక్కడక్కడా వినవస్తోంది. అదే నిజం అయితే.. ఇప్పుడు ఏపీలో టీడీపీ ఆఫీసుల‌పై జ‌రిగిన దాడులు వ్యూహం కూడా ప్ర‌శాంత్ కిశోర్ బృందానిదే అన‌డానికి సందేహించాల్సిన ప‌నిలేదంటున్నారు. ఏది ఏమైనా.. పీకే గొప్ప వ్యూహకర్త మాత్రమే కాదు.. కొంచెం చాలా ప్రమాదకర వ్యూహకర్త గానూ అనుమానించ వలసి వస్తోంది.