TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అమెరికా ఆంక్షలు లెక్క చేయం.. ప్రతీకార దాడులు చేస్తాం.. ఇరాన్ వార్నింగ్.!

Published on: Tue Aug 25, 2026 10:01AM

పశ్చిమాసియాలో  మళ్లీ యుద్ధ మేఘాలు దట్టంగా అలుముకున్నాయి.  ఇరాన్ పై  అమెరికా కొత్తగా కఠినాతి కఠినమైన ఆంక్షలు విధించడమే ఇందుకు కారణం.   అమెరికా విధించిన ఆంక్షలపై ఘాటుగా స్పందించిన ఇరాన్  ప్రతీకార చర్యల తప్పవని హెచ్చరించింది.   ఆపరేషన్ ఎకనామిక్ అవుట్‌క్యాస్ట్  పేరుతో అమెరికా ఇరాన్ పై ఆంక్షలువిధిస్తున్నట్లు చేసిన ప్రకటన.. ఇరాన్ ఆదాయ మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా ఉంది. ఈ కొత్త  ఆంక్షల పరిధిలోకి డిజిటల్ ఆస్తులు,  సాంకేతిక పరిజ్ఞానం, బంగారం, విమానయాన రంగం,  సముద్ర ఆధారిత నౌకా రవాణా రంగాలు తీవ్రంగా ప్రభావితమౌతాయి. 

అలాగే.. ఇరాన్‌తో ఎ  వ్యాపార వాణిజ్య సంబంధాలు నెరిపే ఇతర దేశాలు, అంతర్జాతీయ కంపెనీలపై కూడా  ఆంక్షలు అమలు చేస్తామని వాషింగ్టన్ హెచ్చరించింది. ఇరాన్ చమురు విక్రయాలు, ఆయుధ కొనుగోళ్లు, సైబర్ ఆపరేషన్లతో నేరుగా సంబంధం కలిగిన 60కి పైగా   వ్యక్తులు, ప్రైవేటు సంస్థలు,  సరుకు రవాణా నౌకలను అమెరికా  ఆ ఆంక్షల జాబితాలో చేర్చింది. దీనిపై ఇరాన్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.   శత్రువుల దాడి కోసం నిష్క్రియగా వేచి చూడబోమని, ఎదురుదాడే తమ మార్గమని కుండబద్దలు కొట్టింది.  అమెరికాది ఆర్థిక ఉగ్రవాదమని పేర్కొన్న ఇరాన్.. దానిని తిప్పికొట్టేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామని కుండబద్దలు కొట్టింది.  

చైనా, రష్యా వంటి తమ మిత్రదేశాలు అమెరికా ఏకపక్ష ఆంక్షలను అంగీకరించబోవని ఇరాన్ ధీమా వ్యక్తం చేసింది.  అంతే కాకుండా, అమెరికాకు సహకరించే పొరుగు దేశాలు  భూకంప స్థాయి ప్రతీకారాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది.  ఇరాన్ మౌలిక వనరులను అమెరికా దెబ్బతీయాలని చూస్తే, పర్షియన్ గల్ఫ్,  హార్ముజ్ జలసంధి ద్వారా ప్రపంచానికి వెళ్లే చమురు రవాణాను పూర్తిగా నిలిపేస్తామని వార్నింగ్ ఇచ్చింది. 

Iran Warning to America, US Iran Sanctions, Tehran Retaliation, Operation Economic Outcast, Persian Gulf Oil Crisis