తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు అన్ని రాష్ట్రాల సీఎంలకూ ఆహ్వానం

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రత్యేకంగా ఆహ్వానించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులను స్వయంగా ఆహ్వానిచే బాధ్యతను మంత్రులకు అప్పగించారు. తాను స్వయంగా ఢిల్లీ వెళ్లి ప్రధానిని ఆహ్వానించారు. ఇక  ఏయే మంత్రులు ఏయే రాష్ట్రాలకు వెళ్లి ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులను ఆహ్వానించాలన్నది కూడా నిర్ణయించారు. ఆ మేరకు ఆయా మంత్రులు ఆయా రాష్ట్రాలకు వెళ్లి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానపత్రాలు అందించి ఆహ్వానిస్తారు.  

ఈ నెల 8, 9 తేదీలలో  తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సదస్సుకు జార్ఖండ్ సీఎంను ఆహ్వానించేందుకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, జమ్మూకాశ్మీర్ సీఎంను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పంజాబ్, హర్యానా సీఎంలను మంత్రి రాజనర్సింహ ఆయా రాష్ట్రాలకు వెళ్లి ఆహ్వానిస్తారు. అలాగే ఏపీ, కేరళ సీఎంలను మంత్రి కోమటిరెడ్డి ఆహ్వానిస్తారు.

కర్నాటక, తమిళనాడు సీఎంలను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, యూపీ సీఎంను పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆహ్వానిస్తారు.  ఇక రాజస్థాన్ సీఎంను మంత్రి పొన్నం ప్రభాకర్, పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీని మంత్రి సీతక్క ఆహ్వానించనుండగా, ఛత్తీస్ గఢ్ సీఎంను మంత్రి కొండా సురేఖ అహ్వానిస్తారు. అదే విధంగా మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రిని తుమ్మల నాగేశ్వరరావు, అసోం సీఎంను జూపల్లి కృష్ణారావు, బీహార్ సీఎం నితీష్ కుమార్ ను మంత్రి వివేక్ వెంకటస్వామి ఆహ్వానిస్తారు.

అలాగే ఒడిశా సీఎంను వాకిటి శ్రీహరి, హిమాచల్ ముఖ్యమంత్రిని అడ్లూరు లక్ష్మణ్ కుమార్, మహారాష్ట్ర సీఎంను మహ్మద్ అజారుద్దీన్ ఆహ్వానిస్తారు. ఇక ఢిల్లీ సీఎంకు, కేంద్ర మంత్రులకు కాంగ్రెస్ ఎంపీలు ఆహ్వాన పత్రాలు అందజేస్తారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu