ఏపీలో పెట్టుబడులు పెట్టండి..పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు పిలుపు
posted on Jul 23, 2025 2:32PM
.webp)
సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుంటేనే అభివృద్ధి సాధ్యమని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలో ఇన్వెస్టోపియా గ్లోబల్ సమ్మిట్ సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడుతు ఆర్ధిక సంస్కరణలు 1995లో టెక్నాలజీ రివల్యూషన్‌తో పరిస్థితి మరిందన్నారు. వికసిత్ భారత్‌తో 2047 నాటికి భారత్ మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతోందని ఆయన అన్నారు. ఏపీలో 2026 జనవరి నాటికి క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు. దుబాయ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు.
ఎడారి నుంచి స్వర్గాన్ని సృష్టించిన దేశం దుబాయ్ అని చంద్రబాబు కొనియాడారు. అలాగే తాను గత 30 ఏళ్లుగా వేగంగా అభివృద్ధి చెందుతున్న దుబాయ్‌ని చూస్తున్నానని.. దుబాయ్‌ను చూస్తే తనకు అసూయ కలుగుతోందని అన్నారు. భారత్‌లో ప్రధాని నరేంద్ర మోడీ అత్యంత శక్తివంతమైన నేత అని.. భారత్‌కు యూఏఈతో మంచి సంబంధాలు ఉన్నాయనన్నారు. దేశానికి సరైన సమయంలో ప్రధానిగా మోడీ ఉన్నారని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
అలాగే తమ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు కంపెనీలు రావాలని, అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇన్వెస్టోపియా గ్లోబల్ సమ్మిట్ సదస్సు యూఏఈ ఆధ్వర్యంలోని ఇన్వెస్టోపియా గ్లోబల్ టాక్స్ సిరీస్‌లో భాగంగా నిర్వహించబడుతుంది. ఇది గతంలో న్యూయార్క్, జెనీవా, న్యూఢిల్లీ, ముంబై, కైరో, రబాట్, హవానా, మిలన్ వంటి నగరాలలో జరిగిన ఈవెంట్‌ల సమాహారంలో ఒకటి. ఈ సమ్మిట్‌లో ఆర్థిక, సాంకేతిక, టూరిజం, ఫ్యామిలీ బిజినెస్, ఇ-కామర్స్ వంటి రంగాల్లో పెట్టుబడి అవకాశాలపై చర్చలు జరిగాయి. ఈ కార్యక్రమంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గోన్నారు