ప‌ప్పీ చ‌లాకీ అయ్య‌క చెప్పండి..!

పిల్లాడికి త‌క్కువ‌మార్కులు వ‌చ్చాయ‌ని, లెక్క‌ల్లో మ‌రీ సున్నాయేనా.. అంటూ తండ్రి కొట్టాడు..గ‌దిలో ఓ మూల కూర్చుని ఏడుస్తున్నాడు. అంత‌ లో తోక ఊపుకుంటూ కుక్క‌పిల్ల వెళ్లి వాడి ఒళ్లో కూచుం ది..ఏడ‌వ‌ద్ద‌ని చెప్ప‌లేదుగ‌దా! దాన్ని హ‌త్తుకుని వాడు మ‌రింత ఏడుస్తూ నాకు లెక్క‌లు రావ‌డం లేద‌ని ఏడ్చాడు. మ‌ర్నాడు కుక్క‌పిల్ల త‌న చెప్పు మీద పాస్ పోసింద‌ని ఆ పెద్ద మ‌నిషి చ‌చ్చే ట్టు కొట్టాడు. పిల్ల‌డు అడ్డుప‌డి బ‌య‌టికి తీసికెళ్లాడు. త‌నకు ఇల్లుంది, అమ్మా ఉంది. ప‌ప్పీకి ఎవ‌రున్నారు.. అందుకే పిల్ల డే బాక్స్‌లో పెట్టి ఎవ‌ర‌న్నా తీసికెళ్లం డ‌ని బ‌య‌ట‌పెట్టాడు! 

ఇది క‌థ కాదు. ప‌చ్చి నిజం. వాస్త‌వ చిత్రం. జీవితంలో కొన్ని మ‌న‌సు నొప్పించే నిర్ణ‌యాలూ తీసుకోవాల్సి వ‌స్తుంది. ప‌న్నెం డేళ్ల పిల్లాడికి ఆ ప‌రిస్థితి వ‌చ్చిం ది. అందుకే ప‌ప్పీని దూరంగా పంపించేసేడు. న‌గ‌రం మెక్సికో.. ఆ 12ఏళ్ల పిల్లాడి పేరు ఆంద్రెస్‌. తండ్రి పెద్ద ఉద్యోగి. పిల్ల‌డిని బాగా చ‌దివించి మంచి ఉద్యోగిలా చేయాల‌ని త‌ల్లి ఆకాంక్ష‌. పిల్ల‌డు బాగానే చ‌దువుతుంటాడు. ఇంటి ద‌గ్గ‌ర మాత్రం ప‌ప్పీని వ‌ద‌ల‌డు. దానితోనే ఆట‌పాట‌లంతా. తిండికి త‌ల్లి పిలిస్తేనే వెళుతూంటాడు. చీక‌టిప‌డ్డాక త‌ల్లి ఓ గంట చ‌దివిస్తుం టుంది. తండ్రికి ఇంట్లో ప‌ప్పీ ఉండ‌డంవ‌ల్ల‌నే వాడికి అల్ల‌రి ఎక్కువై మొండిగా త‌యార‌య్యాడ‌ని న‌మ్మ‌కం. అందుకే దాన్ని వాడికి దూరం చేయాల‌నుకున్నాడు. ఒక‌రోజు ఆఫీసుకు వెళ్లేందుకు సిద్ద‌ప‌డ్డాడు. షూ త‌డిగా ఉండ‌డం గ‌మ‌నించి భార్య‌ను తిట్టాడు. త‌ర్వాత ప‌ప్పీ పాస్‌కి వెళ్లింద‌ని ఆమె చెప్పింది. అంతే దాన్ని చచ్చేట్టు కొట్టాడు. తోక‌కి బాగానే గాయాల‌య్యాయి. అది కుయ్యో..మొర్రో అంటూ చిన్న అయ్య‌గారి గ‌దిలోకి పారిపోయి గ‌ట్టిగా మొర‌గ‌డం మొద‌లెట్టింది. 

సాయింత్రం బ‌డి నుంచి పిల్ల‌డు రాగానే కుంటుతూ ప‌డుతూ వ‌చ్చి ప‌ప్పీ వాడి కాళ్ల‌మీద‌ప‌డింది. వాడికి న‌వొ్చ్చింది. అదేదో న‌టిస్తోంది. త‌ర్వాత చూస్తే గాయాల‌మ‌యం. వాడికి ఏడుపు ఆగలేదు. తండ్రిని తిట్టుకున్నాడు. ఇక్క‌డుంటే క‌ష్ట‌మ‌ని దాన్ని బాగా చూసుకోమ‌ని కోరుతూ ఒక జంతుసంర‌క్ష‌ణ సంస్థ‌కు లేఖ రాశాడు. ఆ కాయితం, త‌న‌కు మ‌రింత ఇష్ట‌మైన బొమ్మ‌తో పాటు ప‌ప్పిని ఒక అట్ట‌పెట్టెలో పెట్టి గుమ్మం బ‌య‌ట‌పెట్టి, ఆ సంస్థ‌వారికి ఫోన్ చేయించాడు త‌ల్లిచేత‌.  వారొచ్చి తీసికెళ్లారు. వారు పిల్ల‌డి ఉదార‌త్వాన్ని మెచ్చుకున్నారు. అంత‌కంటే ఆ ఉత్త‌రం చ‌దివి క‌న్నీళ్లూ పెట్టుకున్నారు. ఇంత‌కీ అందులో ఏముంది..

స‌ర్‌,  ఇది నా ప్రాణం. మా నాన్న దుర్మార్గుడు, తాగుబోతు కూడా. న‌న్ను కొడుతున్నాడు. పాపం ప‌ప్పీని మాత్రం చ‌చ్చేట్టే కొడుతున్నాడు, కొట్టాడు. దీన్ని నేను రక్షించుకోలేను. నాకు ఇల్లుంది, అమ్మా ఉంది... వీడికి ఏమీ చేయ‌లేని, ర‌క్ష‌ణ అస్స‌లు ఇవ్వ‌లేని నేనున్నాను.. నిష్ర్ప‌యోజ‌కుడిని.. అందుకే మీరు జాగ్ర‌త్త‌గా పెంచండి... అన్న‌ట్టు వెంట‌నే దాని తోక గాయానికి క‌ట్టు గట్టండి.. అది బాగా తిరుగుతూ, అల్ల‌రి చేస్తున్న‌పుడే మ‌ళ్లీ నాకు ఇన్‌ఫామ్ చేయండి..ఉంటా! .. అని.