కేవలం నాలుగుగంటల్లోనే విజయవాడ టు సింగపూర్!
posted on Oct 23, 2025 9:03AM
.webp)
ఆంధ్రప్రదేశ్‌లో వైమానిక సర్వీసులు వేగంగా విస్తరిస్తున్నాయి. రాష్ట్ర పురోభివృద్ధికి ఇదొక సూచికగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. దేశీయ, అంతర్జాతీయ వైమానిక సర్వీసుల విస్తరణ రాష్ట్రం పురో గమనానికి ఎంతగానో దోహదం చేస్తుందనడంలో సందేహం లేదు. తాజాగా విజయవాడ నుంచి సింగపూర్‌కు మరో కొత్త సర్వీసు ఆరంభం కానుంది. ఇండిగో విమానసంస్థ విజయవాడ నుంచి సింగపూర్ కు అంతర్జాతీయ విమాన సర్వీసును వచ్చే నెల 15 నుంచి ప్రారంభించనుంది.
ఈ సర్వీసు అందుబాటులోకి వస్తే ఇక విజయవాడ నుంచి కేవలం నాలుగంటే నాలుగు గంటలలో సింగపూర్ చేరుకునే వీలు కలుగుతుంది. అలాగే రాష్ట్రం నుంచి విదేశీ ప్రయాణం సులభమౌతుంది. ఇక విజయవాడ నుంచి సింగపూర్ కు విమాన టికెట్ ధరను ఇండిగో సంస్థ ఎనిమిది వేల రూపాయలుగా నిర్ణయించింది. ఈ విమానం సింగపూర్ నుంచి ఉదయం బయలుదేరి విజయవాడకు ఉదయం 7 గంటల 45 నిముషాలకు చేరుకుంటుంది. ఇక విజయవాడ నుంచి ఉదయం 10 గంటల ఐదు నిముషాలకు బయలుదేరి మధ్యాహ్నం 2 గంటల 5 నిముషాలకు సింగపూర్ చేరుకుంటుంది.
ఇండిగో సంస్థ నిర్ణయించిన ప్రకారం ఈ విమాన టికెట్ ధర రూ.8 వేలుగా నిర్ణయించారు. ఈ విమానం ఉదయం 4 గంటల 45 నిముషాలకు సింగపూర్ నుంచి బయలుదేరి భారతీయ కాలమానం ప్రకారం ఉదయం 7.45 గంటలకు విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంటుంది. అక్కడి నుంచి తిరిగి ఉదయం 10.05 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.05 గంటలకు సింగపూర్‌లోని ప్రసిద్ధ చాంగి విమానాశ్రయానికి చేరుకుంటుంది. కేవలం నాలుగు గంటల్లోనే సింగపూర్ నుంచి విజయవాడకు, అలాగే విజయవాడ నుంచి సింగపూర్ కు విమాన ప్రయాణం పూర్తికావడం వల్ల ప్రయాణీకులకు ఎంతో సమయం ఆదా అవుతుంది. ఈ విమాన సర్వీసుకు సంబంధించిన టికెట్ విక్రయాలు ప్రారంభమైనట్లు ఇండిగో సంస్థ తెలిపింది. యి.