తెలుగు రాష్ట్రాల్లోని 14 ప్రాంతాల్లో హైఅలర్ట్

 

భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లోని 14 ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, శంషాబాద్ ఎయిర్‌పోర్టు, కూకట్‌పల్లి, నాంపల్లి, హైదరాబాద్ సెంట్రల్ బస్‌స్టేషన్, ట్యాంక్‌బండ్‌తో పాటు ఏపీలోని తిరుమల, విశాఖ ఆర్కే బీచ్, విజయవాడ రైల్వేస్టేషన్, విజయవాడ బస్‌స్టాండ్, ఎంజీ రోడ్‌లో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. హైదరాబాద్ అంతా కూడా అలర్ట్ జోన్‌లో ఉంది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షణ కొనసాగుతోంది. డీజీ స్థాయి అధికారి హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పర్యవేక్షణలోనే సూచనలు వెళ్తున్నాయి. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్‌లను నమ్మవద్దని పోలీసులు, ప్రభుత్వం ఇచ్చే అధికారిక సమాచారాన్నే నమ్మాలని పోలీసులు చెబుతున్నారు.హైదరాబాద్‌లోని ఆరు హైఅలర్ట్ జోన్లలో అక్టోపస్, లా అండ్ అండ్ పోలీసులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాయి. పాక్ దాడుల నేపథ్యంలో టీటీడీ అధికారులను కేంద్ర హోంశాఖ అధికారులు అప్రమత్తం చేశారు. 

తిరుమల్లో తీసుకువాల్సిన భద్రతా చర్యలపై టీటీడీ అధికారులకు కేంద్ర హోం శాఖ అధికారులు పలు సూచనలను చేశారు. కేంద్రం ఆదేశాలు మేరకు తిరుమల్లో భద్రతను టీటీడీ మరింత పటిష్టం చేసింది.మరోవైపు భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అప్రమత్తం చేస్తోంది. అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ లేఖ రాసింది. అవసరమైన ముందు జాగ్రత్త చర్యలను సమర్థవంతంగా అమలు చేయడానికి పౌర రక్షణ నిబంధనల ప్రకారం అత్యవసర అధికారాలను ఉపయోగించాలని ఆదేశించింది. అలాగే దేశ వ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భద్రత పెంచారు. భద్రతను రెండో లెవల్‌కు పెంచుతూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. 

భద్రతా పెంపు ఆదేశాలు వెంటనే అమలులోకి వస్తాయని షిప్పింగ్ డైరెక్టర్ జనరల్ తెలిపారు. పోర్టులు, షిప్పులు, టర్మీనల్స్‌లో కేంద్రం భద్రతను పెంచింది.భారత్, పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో రైల్వే స్టేషన్లలో భద్రత పెంచామని సెంట్రల్ రైల్వే సీపీఆర్వో శ్రీధర్ అన్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో ఉద్యోగుల సెలవులను రద్దు చేశామన్నారు. ఆర్పీఎఫ్, ఇంటెలిజెన్సీ పోలీసుల నిఘా పెంచామని తెలిపారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలను రద్దు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి గుజరాత్, ఢిల్లీ, రాజస్థాన్ రూట్లల్లో రైళ్ళు యధావిధిగా నడుస్తున్నాయని అన్నారు. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్‌పై ప్రత్యేకంగా నిఘా పెట్టామని శ్రీధర్ వెల్లడించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu