ఒకే రోజు 2 కోట్ల డోసులు.. పీఎం మోదీకి గ్రాండ్‌ బ‌ర్త్‌డే గిఫ్ట్‌..

సందర్భం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 71 వ పుట్టిన రోజు. అయితే, ఈ పుట్ట్టిన రోజుకు ఉన్న ప్రాధాన్యత మాత్రం కొవిడ్ టీకా. ప్రధాని జన్మదినాన్ని పురస్కరించుకుని, టీకా వేయించుకుని, మరొకరికి టీకా వేయించి ,దాన్నొక ఉద్యమమగా ముందుకు తీసుకుపోవాలని, అదే ఆయనకు కానుకగా ఇద్దామని, బీజేపీ పార్టీ కార్యకర్తలు, నాయకులకు పిలుపు నిచ్చింది,  కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ట్విటర్ వేదికగా  దేశ ప్రజలకు కూడా అదే విజ్ఞప్తి చేశారు. 

కేంద్ర మంత్రి పిలుపున‌కు దేశం స్పందించింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా చురుగ్గా సాగుతున్న కొవిడ్ టీకా కార్యక్రమానికి ప్రధాని పుతిఇన రోజు పిలుపు., కొవిడ్ టీకా దినంగా మార్చి వేసింది. ఒకే రోజులో దేశం వ్యాప్తంగా ఇంచుమించుగా 2 కోట్ల వరకు టీకా డోసులు వేయించుకున్నారు. ఈ రోజు (శుక్రవారం)  మధ్యాహ్నం కల్లా కోటి టీకా డోసులు పంపిణీ అయ్యాయి. ఈ లెక్కన నిమిషానికి 42 వేల మందికి టీకాలు వేసినట్లు నేషనల్ హెల్త్ అథారిటీ చీఫ్ ఆర్ఎస్ శర్మ ట్వీట్ చేశారు. మోదీ జన్మదినం సందర్భంగా ఈ రోజు రెండు కోట్ల మందికి టీకాలు ఇచ్చే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. అయితే ఇలా ఒకే రోజులో కోటి మార్కు దాటడం ఇదే మొదటి సారి కాదు. నెల రోజుల వ్యవధిలో ఇది నాలుగోసారి.. మరో  వంక బీజేపీ ఈరోజు నుంచి 20 రోజుల పాటు ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యక్రమాలను చేపడుతోంది. ఈ 20 రోజులు కూడా ఇదే విధంగా టీకా ఉద్యమం కొనసాగితే, థర్డ్ వేవ్ ను సమర్ధవంతంగా నిరోధించడమే కాకుండా ... కరోనా మహమ్మారిని శాశ్వతంగా పారదోలవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.
 
నిజానికి, అమెరికా, యూకే సహా అనేక ప్రపంచ దేశాలతో పోల్చి నప్పుడు, మన దేశంలో కరోనా టీకా కార్యక్రమం వేగంగా సమర్ధ వంతంగా సాగుతోంది . అధికారిక గణాంకాల ప్రకారం నిన్నటికె  (గురువారం) 77 కోట్ల 17 లక్షల 36 వేల 406 డోసుల టీకాలు పంపిణీ అయ్యాయి. మరో వంక దేశ జనాభాలో 40 శాతం మంది ఇప్పటికే రెండు డోసులు టీకా తీసుకున్నారు. ఈ లెక్కన మరో రెండు నెలలలో దేశంలో లేదా ముందుగా ఆనుకున్న విధంగా ఈ సంవత్సరం చివరి నాటికి నూటికి నూరు శాతం టీకా కార్యకమం పూర్తవుతుందని అధికారులు విశ్వాసం వ్యక్త పరుస్తున్నారు. కాగా, మన దేశంలో మందకొండిగా మొదలైన కొవిడ్ టీకా కార్యక్రమం వేగం పుంజుకోవడం ఆనందించదగిన పరిణామంగా భావిస్తున్నారు. ప్రపంచ దేశాలు సైతం  ఈవిషయంలోమన దేశాన్ని అభినందిస్తున్నాయి.