రజనీ, బాలయ్యలకు ఇఫీ సన్మానం ఎప్పుడు? ఎక్కడో తెలుసా?
posted on Nov 17, 2025 11:44AM

ప్రముఖ నటులు రజనీకాంత్, బాలకృష్ణలను ఇఫీ సన్మానించనుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. త్వరలో గోవా వేదికగా జరగనున్న 56వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇఫీ వేడులలలో వీరిని సన్మానించనున్నట్లు కేంద్ర మంత్రి మురుగన్ తెలిపారు. గోవా సీఎం ప్రమోద్ సావంత్‌తో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన ఈ ఇరువురీ చలనచిత్ర పరిశ్రమలో అర్ధశతాబ్ధ ప్రయాణం పూర్తి చేసుకున్నారన్నారు.
ఆ సందర్భాన్ని పురస్కరించుకుని వీరిని సన్మానించనున్నట్లు తెలిపారు. రజనీకాంత్, బాలకృష్ణ 50 ఏళ్ల సినీ ప్రస్థానం ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఓ మైలు రాయిగా పేర్కొన్న ఆయన.. వారి అద్భుతమైన నటన, ప్రజాదరణతో దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరించారన్నారు. వారి కృషికి గుర్తింపుగా ఇఫి ముగింపు వేడుకల్లో వారిని సన్మానించనున్నట్లు తెలిపారు. ప్రతిష్ఠాత్మక ఇఫి వేడుకలు నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలో జరగనున్నాయి.