మద్యం లారీలో మంటలు...ఎగబడిన స్ధానికులు
posted on Oct 1, 2025 6:13PM

అసలే రేపు దసరా పండుగ.... గాంధీ జయంతి సందర్భంగా మద్యం నిషేధం... ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తున్న మందు బాబులకు ఓ లక్కీ డ్రా తగిలింది... లిక్కర్ లోడుతో వెళ్తున్న డీసీఎంకు ప్రమాదం జరిగింది.. దీంతో రోడ్డు మీద మద్యం సీసాలు పడడం చూసిన పబ్లిక్ ఏగపడ్డారు. ఇంకేముంది అందిన కాడికల్లా మద్యం సీసాలను ఎత్తు కెళ్లారు... డ్రైవర్ లబోదిబో మొత్తు కున్నా కూడా జనం అవేమీ వినకుండా మందు బాటిల్స్ పట్టుకొని పరుగు లగాయించారు... ఈ ఘటన రామంతపూర్ పరిధిలో చోటుచేసుకుంది.
రామంతపూర్ స్ట్రీట్ నెంబర్ 8 లో రోడ్డుమీద వెళ్తున్న లిక్కర్ డీసీఎంలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు వచ్చాయి. కరెంటు వైర్లు కిందకి ఉండడంతో డీసీఎం వాటి పై నుండి వెళ్లడంతో మంటలు చెలరేగాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఫైర్ ఇంజన్ ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసింది. లిక్కర్ డీసీఎం లో ఉన్న లిక్కర్ బాటిల్స్ కొంత భాగం తగల బడ్డాయి. కానీ ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగ లేదు. కానీ ఈ ప్రమాదం జరిగిన సమయంలో డీసీఎం నుండి కొన్ని మద్యం బాటిల్స్ బాక్స్ లు రోడ్డు మీద పడ్డాయి.
మరికొందరైతే లిక్కర్ లోడుతో వెళ్తున్న డీసీఎం వాహనానికి సాంకేతిక లోపం రావడం వల్ల..డీసీఎం ఒక్కసారి గా ఆగిపోయిందని.. ఆ సమయంలో డీసీఎం లో ఉన్న లిక్కర్ బాటిల్స్ బాక్సులు కింద పడ్డాయని చెప్తున్నారు... ఏది ఏమైనాప్పటికీ రోడ్డుమీద మద్యం బాటిల్స్ పడడం గమనించిన పబ్లిక్ వెంటనే అక్కడికి చేరుకొని మెల్లిగా చేతికి అందిన కాడికి మద్యం బాటిల్స్ ఎత్తుకొని పారిపోయారు... నడిరోడ్డు మీద ఈ ఘటన జరగడంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పోలీసులు రంగం లోకి దిగి ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు.