హైదరాబాద్‌లో మరోసారి కాల్పుల కలకలం
posted on Oct 25, 2025 5:54PM

హైదరాబాద్ నగరంలో శనివారం సాయంత్రం సమయంలో చాదర్ ఘాట్ ప్రాంతంలోని విక్టోరియా గ్రౌండ్ వద్ద జరిగిన కాల్పుల ఘటన స్థానికంగా సంచ లనం సృష్టించింది. సౌత్ ఈస్ట్ డిసిపి చైతన్యతో పాటు పోలీస్ సిబ్బంది సెల్ఫోన్ దొంగలను పట్టుకుని ప్రయత్నంలో సెల్‌ఫోన్ స్నాచర్ కత్తితో ఒక్కసారిగా డిసిపి చైతన్య పై దాడి చేయడానికి యత్నించాడు. అయితే డిసిపి చైతన్యకు మరియు సెల్ఫోన్ స్నాచర్ మధ్య తోపులాట జరగడంతో డిసిపి చైతన్య గన్మెన్ వెపన్ కింద పడిపోయింది. దీంతో డిసిపి చైతన్య వెంటనే గన్ను తీసుకొని మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు.
చాదర్‌ఘాట్ పరిసర ప్రాంతంలో సెల్‌ఫోన్ స్నాచింగ్ జరుగుతున్నట్లు సమాచారం రావడంతో వెంటనే సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య, సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఒక దొంగను పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆ దొంగ డీసీపీపై కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించాడు. తనకు ప్రాణాపాయం ఉన్న నేపథ్యంలో డీసీపీ చైతన్య స్వయంగా తన గన్ తీసుకుని దొంగపై కాల్పులు జరిపారు.
మొత్తం మూడు రౌండ్ల కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. తోపులాటలో డీసీపీ గన్‌మెన్ కింద పడి గన్ నేలపై పడగా, వెంటనే డీసీపీ స్వయంగా ఆయు ధాన్ని స్వాధీనం చేసుకొని ఫైర్ చేసినట్టు పోలీసులు తెలిపారు.ఈ కాల్పుల్లో ఇద్దరు దొంగలకు గాయాలయ్యాయి.
వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అదృష్టవశాత్తూ డీసీపీ చైతన్యతో పాటు మిగతా పోలీస్ సిబ్బంది క్షేమంగా ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే హైదరాబాద్ సీపీ సజ్జనార్ సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. మొత్తం రెండు రౌండ్లు దొంగలపై ఫైర్ చేసినట్లు ఆయన తెలిపారు. నగర పోలీసుల అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పిందని వెల్లడించారు.