పెళ్లి.. ఆమెకు ఉరి.. 

అది పాలకొండ పట్టణం. రామకళామందిర్‌ వీధి. ఆమె పేరు హనుమాన్‌శెట్టి ఉమా వెంకట సీతామహాలక్ష్మి. ఆమె వయసు 23 ఏళ్ళు. పెళ్లి అయింది. ఆ రోజు బుధవారం. ఇంట్లో ఎవరు లేరు. సీతామహాలక్ష్మీ ఇంటి తలుపులు మూసింది. ఫ్యాన్‌కు ఉరివేసుకుని   ఆత్మహత్యకు పాల్పడింది. విశాఖపట్నంలోని ఎండాడకు చెందిన ఈమెకు పాలకొండ పట్టణానికి చెందిన హనుమాన్‌శెట్టి వినయ్‌కుమార్‌తో తొమ్మిది నెలల కిందట వివాహమైంది. ఘటన సమాచారం అందుకున్న ఎస్సై సీహెచ్‌ ప్రసాద్‌ ఘటనాస్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు. అనంతరం డీఎస్పీ ఎం.శ్రావణి, సీఐ జి.శంకరరావు ఘటనాస్థలాన్ని పరిశీలించి కుటుంబసభ్యుల నుంచి వివరాలు సేకరించారు. క్లూస్‌టీం ఘటనాస్థలంలో ఆధారాలను సేకరించారు. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.   


వరకట్నమే కారణం 

తమ కుమార్తె మృతికి వరకట్న వేధింపులే కారణమని తల్లిదండ్రులు ఎం.సావిత్రి, కృష్ణమూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిత్యం ఇంట్లో తమ కుమార్తెను వేధిస్తుండేవారని పోలీసులకు వివరిస్తూ తల్లిదండ్రులు బోరున విలపించారు. నిత్యం కుటుంబంలో గొడవలు ఉండేవని పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో పోలీసులు భర్త వినయ్‌తో పాటు కుటుంబసభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.    

మన ఫ్రెండ్ డల్లే ఇంకెవాడుంటాడు. జనమండర్లో తానొక్కడేం కాడు. ప్రతి ఒక జీవితంలో ఒక మంచి స్నేహితుడు ఉండాలి. ఎందుకంటే మన కష్టాన్ని, ఇష్టాన్ని పంచుకునేవాడు ఫ్రెండ్ ఒక్కడే. ఒక మంచి ఫ్రెండ్ మన లైఫ్ లో ఉండే మన ప్రయాణానికి , మన కుటుంబానికి ఎలాంటి భయం ఉండదు. ఇద్దంత మీకు ఎందుకు చెప్తున్నానో మీరే చూడండి. 

రోడ్డు  ప్రమాదంలో గాయపడిన తమ మిత్రుని కాపాడుకోవాలని వారు పడిన తాపత్రయం నెరవేరలేదు. చికిత్సపొందుతూ పాలకొండ మండలం వెలగవాడకు చెందిన ఎన్ని విజయ్‌కుమార్‌ రాజు(30) బుధవారం మృతిచెందాడు. ఈ నెల తొమ్మిదిన ఈ యువకుడు స్థానిక సింగన్నవలస కూడలి వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి తీవ్రంగా గాయపడ్డాడు. శ్రీకాకుళం ఓ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు. ఏడాదిన్నర కిందట వివాహమైంది. భార్య శ్రీదేవి గర్భిణి. తండ్రి చనిపోవడంతో ప్రైవేటు వాహన డ్రైవరుగా పనిచేస్తూ తల్లి, భార్యను పోషిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన మృతితో భార్య, తల్లి దుఃఖానికి అంతేలేకుండాపోయింది.    

విరాళాలు పోగుచేస్తుండగానే..:  పేదకుటుంబానికి చెందిన విజయ్‌కుమార్‌కు వైద్యానికి రూ.4 లక్షల వరకు ఖర్చవుతుందని తెలుసుకున్న స్నేహితులు రెండు రోజులుగా విరాళాలు సేకరిస్తున్నారు. మిత్రుడిని బతికించుకుందామని డబ్బులు పోగుచేస్తున్న క్రమంలోనే మృతిచెందడంతో వారు కన్నీటి పర్యంతమవుతున్నారు.